Sangeeth Sobhan's Rakasa Trailer Review : టాలీవుడ్ యంగ్ హీరో, మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ ఫేం సంగీత్ శోభన్ సోలో హీరోగా రాబోతోన్న లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ 'రాకాస'. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ బిగ్ హైప్ క్రియేట్ చేయగా... తాజా ట్రైలర్ అది పదింతలు చేసింది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

ఓ ఊరి శాపం వెనుక ఉన్న స్టోరీనే బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 'ఆ కోటలో ఉంది. ఊరు బలి పంపుతున్నది సామాన్యుడికి కాదు. భీకర బ్రహ్మ రాక్షసుడికి...' అంటూ ట్రైలర్ ప్రారంభంలోనే థ్రిల్ పంచారు. ఊరి కోటలో ఉన్న ఓ అతీంద్రియ శక్తికి ఊరి ప్రజలు బలి పంపడం, దాని వెనుక ఉన్న మిస్టరీని సస్పెన్స్‌గా చూపించారు. 

కామెడీ, హారర్ అంశాలతో పాటు ఎమోషన్ కూడా టచ్ చేశారు. ఊరి బంగ్లాలో దాగి ఉన్న రహస్యం దాన్ని ఛేదించేందుకు హీరో టీం పడే పాట్లను చూపిస్తూ నవ్వుతూనే భయపెట్టేశారు. ఇప్పటివరకూ నవ్వులు పూయించిన సంగీత్ శోభన్... రాకాసతో భయపెట్టారు. 

అమెరికా నుంచి వచ్చిన యువకుడికి ఆ ఊరికి సంబంధం ఏంటి? ఊరిలో పాడుబడిన బంగ్లా వెనుక మిస్టరీ ఏంటి? కోటలో ఉన్న శక్తికి బలి ఇచ్చేందుకు హీరో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అందులో చిక్కుకున్న హీరో దాన్ని ఎలా ఛేదించాడు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. 

Also Read : యుద్ధం, గ్యాస్ కొరత గురించి చర్చిద్దాం - వల్గర్ సాంగ్ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించగా... సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. అలాగే, వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, అన్నపూర్ణ, రమణ భార్గవ్, వాసు యింటూరి, జబర్దస్త్ రోహిణి, నైంటీస్ ఫేం రోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మించారు. ఏప్రిల్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.