Pawan Kalyan New Movie With Director Surender Script Locked : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన డైరెక్టర్ సురేందర్ రెడ్డితో మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ స్క్రిప్ట్ ఓకే అయినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

పవన్‌తో సురేందర్  రెడ్డి తీయబోయే మూవీకి వక్కంతం వంశీ స్టోరీ అందిస్తుండగా... అది ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ స్టోరీతో పాటు క్యారెక్టరైజేషన్ కుదిరాయని... తన కెరీర్‌లోనే వంశీ ది బెస్ట్ ఇచ్చారని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్న మాట. రీసెంట్‌గా వచ్చిన మూవీస్ పవనిజం, డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి.

తాజా మూవీ కేవలం ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా అందరికీ నచ్చేలా ఈ స్క్రిప్ట్ డిజైన్ చేశారని తెలుస్తోంది. 'పవన్ కెరీర్‌లోనే ఓ మకుటం లాంటి మూవీ రెడీ కాబోతోంది' అంటూ ఫిలింనగర్ వర్గాల నుంచి తెలిస్తున్న సమాచారం. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. 'జైత్ర రామ్ మూవీస్' బ్యానర్‌పై రామ్ తాళ్లూరి సినిమాను నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.

Also Read : యుద్ధం, గ్యాస్ కొరత గురించి చర్చిద్దాం - వల్గర్ సాంగ్ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్

పొటిలికల్ థ్రిల్లర్‌పై క్లారిటీ

ఇక, డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నారంటూ వస్తోన్న ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది. అందులో నిజం లేదని తేలింది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ సైతం దీనిపై రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతానికి పవన్ ఏ కొత్త సినిమాను కూడా అంగీకరించలేదని తెలిపింది. దీనిపై డైరెక్టర్ దేవా కట్టా కూడా రియాక్ట్ అయ్యారు.

ఈ ప్రచారం ఎలా మొదలైందో తనకు తెలియదని చెప్పారు డైరెక్టర్ దేవా కట్టా. 'పవన్ కల్యాణ్ గారితో వర్క్ చేయడం అనేది అద్భుతమైన కల. రిపబ్లిక్ మూవీ ఆలోచన కూడా ఆయన్ను దృష్టిలో పెట్టుకుని వచ్చిందే. ఏదైనా కథ మా ఇద్దరికీ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే కచ్చితంగా సినిమా చేస్తాం.

ప్రస్తుతం అద్భుతమైన టాలెంట్ కూడిన వ్యక్తులతో కలిసి పొలిటికల్ రిలేట్ కాని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా, మనందరికీ సరికొత్తగా అనిపించే విభిన్న ఆలోచనలను అన్వేషిస్తున్నా. పాలిటిక్స్‌కు సంబంధించి ఎలాంటి సినిమాలు కూడా చేయడం లేదు. త్వరలోనే అన్నీ వివరాలు వెల్లడిస్తా.' అని చెప్పారు.