Raju Weds Rambai Movie Two Days Box Office Collection : చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకుంది. కేవలం మౌత్ టాక్‌తోనే హార్ట్ టచింగ్ ఎమోషనల్‌గా ఆడియన్స్‌లోకి వెళ్లి థియేటర్లకు రాబడుతోంది. అదే రీసెంట్ విలేజ్ కల్ట్ బ్లాక్ బస్టర్ 'రాజు వెడ్స్ రాంబాయి'. మరి రెండు రోజుల్లో ఎంత కలెక్షన్స్ సాధించిందంటే...

Continues below advertisement


తొలి 2 రోజుల్లోనే...


ఈ మూవీ తొలి 2 రోజుల్లో ఇండియావ్యాప్తంగా రూ.4.04 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.1.47 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా... రెండు రోజుల్లో రూ.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, నైజాంలో రూ.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది.


తొలుత తక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేయగా మూవీ బిగ్ సక్సెస్ అందుకోవడంతో దాదాపు 100 స్క్రీన్లను పెంచారు. తక్కువ రేట్స్, మౌత్ టాక్ కారణంగానే బంపర్ ఓపెనింగ్స్‌తో పాటు మంచి కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈ మూవీ మరిన్ని కలెక్షన్స్ సాధించడం ఖాయమని అంటున్నారు.






Also Read : చెత్త రీల్స్ అంటూ 'డ్యూడ్'పై రివ్యూ - 'నీ పని నువ్వు చూసుకో' అంటూ డైరెక్టర్ కౌంటర్... అసలు స్టోరీ ఏంటంటే?


ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. పూర్తిగా కొత్తవారితో ఓ డిఫరెంట్ విలేజ్ లవ్ స్టోరీని రూపొందించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అఖిల్ రాజ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తేజస్విరావు ప్రధాన పాత్రల్లో నటించగా... చైతన్య జొన్నలగడ్డ కీలక పాత్ర పోషించారు. ఈటీవీ విన్ ప్రొడక్షన్‌లో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి మూవీని నిర్మించారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఈ నెల 21న రిలీజ్ చేయగా ఫస్ట్ డే నుంచే మంచి టాక్‌తో దూసుకెళ్తోంది.