Dude Movie Director Keerthiswaran Reaction On Influencer Review : తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, ప్రేమలు ఫేం మమితా బైజు జంటగా నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'డ్యూడ్'. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్ సక్సెస్ అందుకుంది. వారం రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ చేరుకుంది. ఇటీవలే 'నెట్ ఫ్లిక్స్' వేదికగా తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Continues below advertisement


తాజాగా... ఈ మూవీ గురించి ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన కామెంట్‌పై డైరెక్టర్ కౌంటర్ ఇచ్చాడు. అయితే, తాను ఇచ్చిన సలహాను కూడా డైరెక్టర్ తీసుకోలేకపోతున్నారంటూ ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో చాటింగ్ బయటపెట్టాడు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.


అసలేం జరిగిందంటే?


'డ్యూడ్' మూవీ గురించి ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తూ... డైరెక్టర్‌ అకౌంట్‌కు నేరుగా మెసేజ్ చేశారు. 'మీ ఇంటర్వ్యూ చూశాను. హీరోయిన్ మమిత మోకాళ్లపై కూర్చుని లవ్ ఎక్స్‌ప్రెస్ చేసే సీన్ చాలా నార్మల్‌గా చూపించారు. అలా చెయ్యొద్దు. నిజమైన ఫ్రెండ్స్ ఎవరూ కూడా అలా మాట్లాడుకోరు. మీరు చెప్పినట్లు కూడా అదేమంత చిన్న విషయం కాదు. అలాంటి సిగ్గుచేటు పని ఫ్రెండ్స్ మధ్య నార్మల్ అన్నట్లు మీరు చెప్పడం బాగోలేదు.


మూవీ కూడా అర్థవంతంగా లేదు. సీన్స్ మధ్య కరెక్ట్ కనెక్షన్ లేదు. చెత్త రీల్స్ అన్నీ ఓ చోట చేర్చినట్లుగా అనిపించింది. ఇక నుంచైనా కాస్త మంచి మూవీస్ తీయండి.' అంటూ సలహా ఇచ్చారు.


కీర్తీశ్వరన్ కౌంటర్


ఈ కామెంట్‌కు డైరెక్టర్ కీర్తీశ్వరన్ రియాక్ట్ అయ్యారు. 'నాకు నేరుగా మెసేజ్ చేసే బదులు నీ బతుకేదో నువ్వు బతకొచ్చు కదా' అంటూ సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చాడు. 


Also Read : తిరుమల ప్రసాదంపై అపహాస్యం - యాంకర్ శివజ్యోతి రియాక్షన్


రియాక్ట్ అయ్యేది ఇలాగేనా?


దీంతో సదరు ఇన్‌ఫ్లుయెన్సర్... డైరెక్టర్‌తో జరిగిన చాట్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ... విమర్శలను తీసుకునేది ఇలాగేనా? అంటూ ప్రశ్నించారు. 'డ్యూడ్ మూవీ, డైరెక్టర్ ఇంటర్వ్యూ క్లిప్ చూశాను. ఓ సగటు ఆడియన్‌గా డబ్బులు చెల్లించి మరీ మూవీ చూశా. సినిమాపై నా ఒపీనియన్ డైరెక్టర్‌తో నేరుగా పంచుకున్నా. ఇలాంటి సలహాలు, సూచనలు కొత్త దర్శకుడు స్వీకరిస్తాడని అనుకున్నాా. కానీ, ఇదిలో ఇలా ఆన్సర్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో దర్శకుడిగా తొలి అడుగులు వేసే వ్యక్తి విమర్శలకు రియాక్ట్ అయ్యే తీరు ఇదేనా? ఏమాత్రం విమర్శలను తీసుకోలేని అతని మనస్తత్వం ఇక్కడే అర్థమవుతోంది.' అంటూ రాసుకొచ్చారు.


నెటిజన్లు ఏంటున్నారంటే?


ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు డైరెక్టర్‌కు సపోర్ట్ చేస్తున్నారు. 'డ్యూడ్' మూవీ ప్రదీప్‌తో కాకుండా వేరే ఎవరితో తీసినా ప్లాప్ అయ్యేది. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు డైరెక్టర్స్ విమర్శలను కూడా తీసుకోగలగాలని అంటున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా... మరి హీరో ప్రదీప్, డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.