సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'వేట్టయన్' ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ బద్ద భారీ ఓపెనింగ్ రాబట్టడానికి రెడీగా ఉంది. అయితే ఈ సినిమా రజినీకాంత్ గత బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్' రికార్డును బ్రేక్ చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఇంతకీ ఈ మూవీ టాక్ ఎలా ఉంది? డే వన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టబోతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


'జై భీమ్' సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపును దక్కించుకున్న తమిళ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్. ఆయనతో తాజాగా తలైవా రజనీకాంత్ తీసిన సినిమానే 'వేట్టయన్'. దసరా కానుకగా అక్టోబర్ 10 అంటే ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ టాక్ సినిమా బిజినెస్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేకపోయిందని తెలుస్తోంది. ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా అడ్వాన్స్ సేల్స్ లో అదరగొట్టింది. అన్ని వెర్షన్లలో కలిపి దాదాపు రూ.7.8 లక్షల టికెట్ల అమ్ముడయ్యాయి. ఈ టికెట్ల ద్వారా దాదాపు రూ.15.22 కోట్లను 'వేట్టయన్' రాబట్టింది. గతేడాది ఆగస్టులో రిలీజ్ అయిన 'జైలర్' మూవీ తొలి రోజు ప్రీ సేల్స్ బిజినెస్ లో రూ. 18.21 కోట్ల గ్రాస్ ను నమోదు చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.8.7 లక్షల టికెట్ బుకింగ్స్ సేల్ జరిగింది. ఇక మొదటి రోజే 'జైలర్' మూవీ రూ.48.35 కోట్లతో భారీ ఓపెనింగ్ లో రాబట్టింది. ప్రస్తుతం సినిమా టాక్ ను బట్టి చూస్తే 'వేట్టయన్' మూవీ ఇండియాలో 40 నుంచి 50 కోట్ల ఓపెనింగ్ ను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా జైలర్ ఓపెనింగ్ కు ఈ లెక్కలు దగ్గరగానే ఉండొచ్చు. కానీ 'వేట్టయన్' ఓపెనింగ్ డే బిజినెస్ 'జైలర్'ను మాత్రం మించిపోయే ఛాన్స్ లేదు. 


Also Read: 'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?



మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ సినిమా ఇండియాలో దాదాపు 10 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసిందని, సాయంత్రానికి ఈ బిజినెస్ మరింతగా పెరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం 'వేట్టయన్' ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఓపెనింగ్ మాత్రం కాదు. ఓపెనింగ్ అటు ఇటుగా 'జైలర్' రేంజ్ లోనే కొట్టబోతోంది. కానీ థియేట్రికల్ రన్ అనేదే ఇప్పుడు సమస్యగా మారింది. 'జైలర్' మూవీ దాదాపు 8 వారాల పాటు థియేటర్లలో నడిచింది. థియేట్రికల్ రన్ టైం పూర్తయ్యేసరికి ఈ సినిమా ఒక్క ఇండియాలోనే రూ.348.55 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. అయితే 'జైలర్' మూవీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా బాగుందనే పాజిటివ్ టాక్. కానీ 'వేట్టయన్' విషయంలో ఇదే లోటుగా కనిపిస్తోంది. ఇక దసరా సందర్భంగా రానున్న వీకెండ్ ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ గా మారే ఛాన్స్ ఉంది. ఈ ఫస్ట్ వీకెండ్ 'వేట్టయన్' సినిమా భవిష్యత్తును నిర్ణయించబోతోంది.


Read also : Ratan TATA Movie: రతన్ టాటా చేసిన ఏకైక సినిమా... ఆయన మళ్లీ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా?