Rajinikanth About Vettaiyan Movie: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెకుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వేట్టయన్’. పలువురు స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి, సినిమా కథ గురించి కీలక విషయాలు వెల్లడించారు సూపర్ స్టార్. ఈ మూవీ కథకు సంబంధించి దర్శకుడికి కొన్ని కీలక మార్పులు చేర్పులు సూచినట్లు తెలిపారు. కొన్ని కమర్షియల్ హంగులు అద్దాలని కోరానన్నారు.

  


కథకు కమర్షియల్ హంగులు అద్దాలన్నాను- రజనీకాంత్


Rajinikanth On Vettaiyan Story: తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న రజనీకాంత్ ‘వేట్టయన్’ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. తన కూతురు సౌందర్య చెప్పడంతో ‘వేట్టయన్’ సినిమా కథ విన్నట్లు వెల్లడించారు. “టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. కానీ, అంతకు ముందుక ఆయనతో ఎప్పుడూ కలిసి మాట్లాడే ఛాన్స్ రాలేదు. ఓ సారి నా కూతురు సౌందర్య ‘వేట్టయన్’ కథ వినాలని చెప్పింది. తను చెప్పాక కొద్ది రోజులకు నేను విన్నాను. స్టోరీ చాలా బాగుంది. అయితే, ఈ కథ విన్నాక  సినిమా తెరకెక్కించేందుకు చాలా బడ్జెట్ అవసరం అవుతుందని అనిపించింది. అందుకే, కథ విషయంలో దర్శకుడికి కొన్ని మార్పులు సూచించాను. స్టోరీలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని చెప్పాను. నా మాట విని ఈ సినిమాను కమర్షియల్ మూవీగా మారుస్తానని జ్ఞానవేల్ చెప్పారు. కానీ, కొంత సమయం కావాలన్నారు. అయితే, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ సినిమాల మాదిరిగా మార్చలేనని చెప్పారు. నాకు కావాల్సింది అదే అని చెప్పాను. వాళ్లలా కథలు మార్చితే వాళ్ల దగ్గరికే వెళ్లేవాడిని కదా అన్నాను. ఆ తర్వాత ఆయన శైలిలో సినిమా కథను మార్చారు. కమర్షియర్ మెరుగులు అద్దారు. 10 రోజుల తర్వాత మార్పులు చేసి తీసుకొచ్చారు. ఆ కథ నాకు చాలా నచ్చింది. ఇంతక అద్భుతంగా మార్చారా? ఆశ్చర్యానికి గురయ్యాను” అని చెప్పుకొచ్చారు.



అనురుధ్ ను పట్టుబట్టి మరీ తీసుకున్నారు - రజనీకాంత్


“‘వేట్టయన్’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా కచ్చితంగా అనిరుధ్ ఉండాలని జ్ఞానవేల్ పట్టుబట్టి తీసుకున్నారు. గతంలో నా సినిమాలకు ఆయన అందించిన మ్యూజిక్ దర్శకుడికి బాగా నచ్చింది. అందుకే ఆయనను ఏరికోరి తీసుకున్నారు” అని రజనీకాంత్ వెల్లడించారు.  


ఎన్ కౌంటర్ కథాంశంతో తెరకెక్కిన ‘వేట్టయాన్’


టీజే జ్ఞానవేల్ జర్నలిస్టుగా పని చేస్తున్న సమయంలో ఓ ఫేక్ ఎన్ కౌంటర్ సంచలనం సృష్టించింది. ఆ ఘటనను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. రజనీకాంత్ కెరీర్ లో 170వ సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, రానా, ఫహాద్‌ ఫాజిల్‌, రితికాసింగ్‌, మంజు వారియర్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు.  


Read Also: తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఇమ్రాన్ హష్మీ... ‘గూఢచారి 2’ సెట్‌లో ప్రమాదం - ఇప్పుడు ఎలా ఉన్నారంటే?