Emraan Hashmi Injured: బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు. టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘గూడాచారి 2’ మూవీ షూటింగ్ సెట్స్ లో జరిగిన ప్రమాదంలో ఆయన మెడకు గాయం అయ్యింది. ప్రస్తుతం ‘గూఢాచారి 2’  సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇనుప ముక్క ఆయన మెడకు తగలడంతో గాయం అయ్యింది. వెంటనే అలర్ట్ అయిన చిత్ర బృందం ఆయనను హాస్పిటల్ కు తరలించింది. వైద్యులు ఆయన మెడకు చికిత్స చేశారు. కాసేపటికి ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాయం ప్రమాదకర స్థాయిలో ఏం లేదని వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదన్నారు.  


సొంతంగా యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసిన ఇమ్రాన్ హష్మీ


‘గూఢాచారి 2’ సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలను ఇమ్రాన్ హష్మీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అడవి శేష్ తో పాటు దర్శకుడ వినయ్ ఆయనకు ఈ విషయంలో పూర్తి స్వేచ్చ ఇచ్చారట. ఈ నేపథ్యంలో అన్ని యాక్షన్ సన్నివేశాలను ఇమ్రాన్ స్వయంగా డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన డిజైన్ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఐరన్ రూఫ్ మీద జంప్ చేస్తున్న సమయంలో ఓ ఇనుము ముక్క వచ్చి ఆయన మెడకు తగిలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో కాసేపు షూటింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ గాయానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






 త్వరలో విదేశాల్లో షూటింగ్


‘గూఢాచారి 2’కు సంబంధించిన షూటింగ్ త్వరలో విదేశాల్లో కొనసాగించనున్నారు. కీలక తారాగణంతో కూడిన ముఖ్య సన్నివేశాలను ఫారిన్ లో షూట్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాకు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.



‘ఓజీ’ మూవీలో విలన్ గా ఇమ్రాన్ హష్మీ


అటు ‘గూఢాచారి 2’ సినిమా కంటే ముందే ఇమ్రాన్ హష్మీ ‘ఓజీ’ సినిమాలో విలన్ పాత్రకు ఎంపిక అయ్యారు. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమిఆ తెరకెక్కుతోంది. ‘ఓజీ’ ఇమ్రాన్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా కాగా, ‘గూఢాచారి 2’ ఆయన రెండో సినిమా. ఇక ఇమ్రాన 2002లో ‘పుట్ పాత్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2004లో వచ్చిన ‘మర్డర్’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ‘మర్డర్2’, ‘ఆషిక్ బనాయా ఆప్నే’, ‘హమారీ అధురీ కహానీ’, ‘జెహెర్’, ‘జన్నత్ 2’, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, ‘టైగర్ 3’ సినిమాల్లో నటించారు.  


Read Also: ‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ