Rajinikanth's Jailer 2 Release Date Official Announcement: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023లో రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ డీసెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తలైవా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. జైలర్‌కు సీక్వెల్ రెడీ అవుతుండగా టీజర్ సైతం ఆకట్టుకుంది. 


రిలీజ్ డేట్ ఎప్పుడంటే?


ప్రస్తుతం 'జైలర్ 2' షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... తాజాగా కేరళ షెడ్యూల్ ముగించుకుని చెన్నై చేరుకున్నారు రజినీకాంత్. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 'షూటింగ్ బాగా జరుగుతోంది.' అంటూ తలైవా చెప్పగా... రిలీజ్ ఎప్పుడు ఉంటుంది సార్? అన్న ప్రశ్నకు 2026, జూన్ 12న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 


Also Read: 'ఓజీ' రివ్యూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా? సినిమా హిట్టా? ఫట్టా?


ఈ మూవీలో ఫస్ట్ పార్టులో నటించిన వారంతా కనిపించనున్నారు. రజినీ కాంత్ భార్యగా రమ్యకృష్ణ కీలక రోల్ ప్లే చేశారు. ఇక మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, సునీల్, మిర్నా మేనన్, వినాయకన్ కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మించారు. దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కిన 'జైలర్' రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 


దీనికి సీక్వెల్ సైతం అంతకు మించిన స్థాయిలో తెరకెక్కుతుండగా టీజర్ అనౌన్స్‌మెంట్ వీడియో అదరగొట్టింది. రజినీకాంత్ స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకుని ఉంటే వెనుకాల బ్లాస్ట్ జరగడం... ఆయన గ్రేస్ వేరే లెవల్‌లో ఉంది. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కుటుంబానికి విగ్రహాల చోరీ ముఠా వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. తన కుటుంబాన్ని అంతం చేయాలని చూసిన ముఠా నాయకున్ని సదరు పోలీస్ ఆఫీసర్ ఎలా అంతం చేశాడు? ఈ క్రమంలో ఆయన తెలుసుకున్న షాకింగ్ నిజం? ఇవన్నీ ఫస్ట్ పార్టులో చూపించగా దానికి సీక్వెల్‌గా ఇంట్రెస్టింగ్ స్టోరీతో 'జైలర్ 2' తెరకెక్కనుంది.