ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తన ఆత్మకథ (Rajinikanth Autobiography)ను రాసే పనిలో బిజీగా ఉన్నారని తెలిసింది. అంతే కాదు... దానిని ఫీచర్ ఫిల్మ్‌గా వెండితెరపైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్ ఖబర్. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

బస్ కండక్టర్ టు సూపర్ స్టార్!రజనీకాంత్ గత కొంత కాలంగా ఆత్మకథను రాస్తున్నారు. అందులో ఓ సామాన్యుడి నుండి దేశంలో సూపర్ స్టార్లలో ఒకరిగా ఎదిగిన తన అసాధారణ ప్రయాణాన్ని, తన జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనలు, చిరస్మరణీయ క్షణాలు, మధుర జ్ఞాపకాలు, భావోద్వేగ భరిత క్షణాలు అన్నీ ఉంటాయని సమాచారం. ఈ పుస్తకాన్ని సినిమాగా రూపొందించే చేసే విషయంపై తన సన్నిహితులతో రజనీకాంత్ చర్చలు జరుపుతున్నట్లు చెన్నై వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, తన బయోపిక్ గురించి ఇప్పటి వరకు సూపర్ స్టార్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

Also Read: Chiranjeevi - Gabbar Singh Ramesh - 'గబ్బర్ సింగ్' రమేష్‌కు 'మెగా'స్టార్ అండ... చికిత్సకు సాయం, కుటుంబ సభ్యులకు చెక్ అందజేత

Continues below advertisement

Rajinikanth Upcoming Movies: రజనీకాంత్ రాబోయే సినిమాల విషయానికి వస్తే... నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమా 'జైలర్'కు సీక్వెల్ 'జైలర్ 2' చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమాలో విద్యా బాలన్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు కీలక తారాగణం. 'జైలర్'లో నటించిన రమ్యకృష్ణ, యోగి బాబు, మీర్నా కూడా కనిపించనున్నారు. అంతే కాకుండా... 'జైలర్ 2'లో మోహన్ లాల్, హృతిక్ రోషన్, శివ రాజ్‌ కుమార్, విజయ్ సేతుపతి అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందట. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also ReadChennai Love Story Collections - చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

'జైలర్ 2' తర్వాత 'ధర్మన్' అని మరో యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నారు రజనీకాంత్. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలోని ఆ సినిమా కొన్ని రోజుల క్రితం మొదలైంది. అందులో స్టైలిష్ డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు సూపర్ స్టార్. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. సిమ్రాన్, రాశి ఖన్నా ముఖ్య తారాగణం. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. సోలో హీరోగా రెండు సినిమాలు కాకుండా... నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి మరో ముల్టీస్టారర్ (KHxRK Reunion) చేయనున్నారు.

Also ReadJana Nayagan Collections - 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?