తోటి కళాకారులకు అండగా నిలబడటంలో, వాళ్ళ కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందు ఉండే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి తన మానవత్వాన్ని, మంచి మనసును చాటుకున్నారు. 'గబ్బర్ సింగ్'తో పాటు పలు చిత్రాల్లో విలన్, కామెడీ రోల్స్ చేసి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ (Gabbar Singh Ramesh Actor) ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు.
రమేష్ కుటుంబానికి మూడు లక్షల సాయంఅపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు రమేష్ ఆరోగ్య పరిస్థితిని చిరంజీవి తెలుసుకుంటున్నారు. అతని చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం చేస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.
Also Read: Balakrishna - బాలయ్య ఆరోగ్యం కోసం భారీ హోమం... ప్రత్యేక పూజలు చేయిస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని
మెగా కుటుంబం నుంచి 'గబ్బర్ సింగ్' రమేష్ కుటుంబానికి మరో రెండు లక్షల రూపాయల సాయం అందింది. శనివారం (జూలీ 25న) నాగబాబు తన తరఫున రెండు లక్షల రూపాయల చెక్కును అందించారు. తోటి కళాకారుల పట్ల చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఆప్యాయత, ఆత్మీయత, బాధ్యతాభావానికి ఇది మరో నిదర్శనంగా నిలిచిందని రమేష్ కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు. సినీ కార్మికులు, నటీనటులు అవసరంలో ఉన్నప్పుడు చిరంజీవి ఎన్నో సందర్భాల్లో సహాయం అందించారు.
