Thalaivar 171 First Look Out: సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది. 'విక్రమ్' ఫేం లోకేష్ కనగరాజ్- తలైవా కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. 'తలైవా 171' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా సాలీడ్ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో తలైవా లుక్ నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి.
ఇందులో తలైవా ఇదివరకు ఎన్నడు చూడని సరికొత్తగా కనిపించాడు. స్టైలిష్ కళ్లద్దాలు, లగ్జరీ వాచ్‌తో గ్యాంబ్లర్ లుక్‌లో కనిపించాడు. ఇందులో తలైవా మరింత యంగ్‌గా కనిపించారు. ప్రస్తుతం ఆయన లుక్ బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాలో అంచనాలు పెంచేస్తోంది. ఈ లుక్‌ని విడుదల చేస్తూ టైటిల్ ఏప్రిల్ 22 ప్రకటించనున్నట్టు వెల్లడించాడు డైరెక్టర్ కనగరాజ్. కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుండగా.. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం 'తలైవా171' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. రజనీకాంత్ సర్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తలైవా171 తనకెంతో ప్రత్యేకమన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, మూవీ షూటింగ్‌కు ఇంకా టైం పడుతుందని చెప్పాడు. మే లేదా జూన్‌లో సినిమాను సెట్స్‌కి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. అలాగే ఇది కంప్లీట్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతోందంటూ మూవీ హైప్ పెంచాడు. చాలా ఏళ్ల తర్వాత రజనీ ఇలాంటి సినిమా చేస్తున్నారని, ఈ సినిమా స్క్రిప్ట్ విని తలైవా చాలా సంతోషించారన్నాడు.
నిజానికి అనిరుధ్ తో కలిసి వెళ్లి ఆయనకు ఈ కథ వినిపించానని, స్క్రిప్ట్ విని విని ఆయన చాలా సంతోషించి అనంతరం తనని కౌగిలించుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారన్నాడు. ఇక రజనీ ఓకే చెప్పడంతో తనకు పట్టరాని సంతోషం కలిగిందంటూ లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాతో లోకేష్ కనగరాజ్ ఒక్కసారిగా హాట్‌టాపిక్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయం సాధించింది. దీంతో ఒక్కసారిగా లోకేష్ కనగరాజ్ సెన్సేషన్ అయ్యాడు. ఆ తర్వాత దళపతి విజయ్‌తో లియో సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో రజనీకాంత్‌తో ఆయన చేస్తున్న తలైవా171 చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: ‘ఆడు జీవితం’ రివ్యూ, ‘పుష్ప 3’ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!