Trending
Rajeev Kanakala: రాజమౌళి బండకేసి పులస తీస్తాడు... రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rajeev Kanakala : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తాజాగా రాజమౌళితో సహా పలువురు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ల పని తీరు గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. ఏ దర్శకుడి గురించి ఆయన ఏం చెప్పారంటే ?

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ప్రస్తుతం 'హోమ్ టౌన్' అనే వెబ్ సిరీస్ లో కీలకపాత్రను పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆయన మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల ఇప్పటిదాకా తను వర్క్ చేసిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుల వర్కింగ్ స్టైల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ ఇదే
సాధారణంగా హీరో హీరోయిన్ల గురించే ఎక్కువగా చర్చ నడుస్తుంది. కానీ డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే విషయం బయట జనాలకు పెద్దగా తెలియదనె చెప్పాలి. ఇప్పటిదాకా వందల సినిమాలలో దిగ్గజ దర్శకులతో కలిసి నటించిన ప్రముఖ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల. తాను కలిసి వర్క్ చేసిన డైరెక్టర్స్ గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తనకు కావలసిన ఔట్పుట్ వచ్చేదాకా సంతృప్తి చెందరన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కారణంగానే ఆయనకి జక్కన్న అనే పేరు కూడా వచ్చింది.
తాజాగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ "రాజమౌళికి కావాల్సిన ఔట్పుట్ వచ్చే వరకు నటుడు ఆయన దగ్గర పచ్చి చేప లాంటి వాడు. బండకేసి పులస మొత్తం తీసేస్తారు. వాడు సాయంత్రానికి నేను ఎందుకు వచ్చి పడ్డానురా ఇక్కడ అని ఫీలయ్యాలా చేస్తాడు. కానీ ఆ సినిమా మొత్తం అయిపోయాక, రిలీజ్ అయ్యాక ఆయన దగ్గర పడకపోయి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో అంటూ ఆయనకి ప్రతి విలన్, హీరో దండం పెట్టుకుంటారు. చాలామంది ఆయన ఫోటోలు కూడా పెట్టుకొని ఉంటారు. ఆయనకేం కావాలో వచ్చేంత వరకు వదిలిపెట్టరు. రాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసాక కూడా చేయలేకపోతే ఆయనే యాక్ట్ చేసి చూపిస్తారు. అంత గొప్పోడు రాజమౌళి. మిగతావాళ్లు ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తారు" అంటూ రాజమౌళి గొప్పతనాన్ని వెల్లడించారు. ఇక మరో ప్రముఖ డైరెక్టర్ వినాయక్ తొందరగా షాట్ తీసి ఆర్టిస్టులను వెళ్లిపోమంటారని, ఆయనతో పని ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు యాక్టర్ల కాన్ఫిడెన్స్ ని బాగా బూస్ట్ చేస్తారని, ఇక శేఖర్ కమ్ముల చాలా కూల్ గా వర్క్ చేయించుకుంటారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ఆయన అస్సలు కోప్పడరని, తనకు కావలసింది దొరికేదాకా ఓపికగా, మోహమాటంగా షూట్ చేస్తారని వెల్లడించారు.
మరో రెండ్రోజుల్లో 'హోమ్ టౌన్' రిలీజ్
తెలుగు వెబ్ సిరీస్ 'హోమ్ టౌన్' ఈ శుక్రవారమే అంటే ఏప్రిల్ 4న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‍లో సీనియర్ యాక్టర్ రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యద్మ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. 'హౌమ్ టౌన్' సిరీస్‍కు శ్రీకాంత్ దర్శకత్వం వహించగా, నవీన్ మేడారం ఈ సిరీస్‍కు షోరన్నర్. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సిరీస్ కొడుకును విదేశాలకు పంపి, ఉన్నత చదువులు చదివించాలని కలలు కనే మిడిల్ క్లాస్ తండ్రి స్టోరీ ఆధారంగా నడుస్తుంది.
Also Read: మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా బావుందా? లేదా?