Rajasekhar and Jeevitha Rajasekhar's Sekhar Release Date: రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందిన సినిమా 'శేఖర్'. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మే 20న సినిమాను విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు.
'శేఖర్' సినిమాకు రాజశేఖర్ సతీమణి, నటి జీవిత దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆవిడ రాశారు. ఈ దంపతుల పెద్ద కుమార్తె శివాని ఈ సినిమాలో కీలక పాత్ర చేశారు. ఆమె నిడివి తక్కువ అయినప్పటికీ... సినిమాలో ప్రభావం ఎక్కువ ఉంటుందట.
అరకు నేపథ్యంలో 'శేఖర్' సినిమాను తెరకెక్కించారు. బోసు గూడెంలో గల ఓ తోట బంగ్లాలో జరిగిన నూతన దంపతుల హత్య కేసును మాజీ పోలీస్ అధికారి శేఖర్ ఎలా డీల్ చేశాడన్నది చిత్ర కథాంశం. నూతన దంపతుల హత్య జరుగుతుంది. శేఖర్ తన ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశాడన్నది కూడా ఆసక్తికరమే. ఈ సినిమా కోసం రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లోకి మారారు.
Also Read: సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్
పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
Also Read: తల్లి కాబోతున్న సునీత? ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చారా?