Rajamouli Letter To Prabhas On Baahubali The Epic Release In Japan : డార్లింగ్ ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన మూవీ 'బాహుబలి'. దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ రెండు పార్టులను కలిపి 'బాహుబలి ది ఎపిక్'గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అక్టోబర్ 31న ఇండియావ్యాప్తంగా రిలీజ్ కాగా... మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో సైతం రిలీజ్ కానుంది. ఈ నెల 12న విడుదల కానుండగా... ప్రభాస్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

Continues below advertisement

'బాహుబలి'కి రాజమౌళి లెటర్

ప్రస్తుతం ప్రభాస్ జపాన్‌లో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అక్కడ స్క్రీనింగ్‌లో జపనీస్ అభిమానులతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ప్రభాస్‌కు లెటర్ రాశారు. దీన్ని నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతోంది. 'జపాన్‌లో ఫ్యాన్స్‌కు నువ్వెంటే ఎంత ఇష్టమో నీకు అర్థమై ఉంటుంది. వారి అభిమానం చూసి నీకు ఆనందభాష్పాలు వస్తాయని నాకు తెలుసు. నేను జపాన్ నాలుగు సార్లు వెళ్లాను.

Continues below advertisement

అక్కడికి వెళ్లిన ప్రతీసారి నన్ను అక్కడ అభిమానులు ఒకటే అడిగేవారు. 'ప్రభాస్ ఇక్కడికి ఎప్పుడు వస్తారు?' అని. నేడు వారి కోరిక ఫలించింది. ఇన్ని రోజులకు నా బాహుబలి అక్కడ సందడి చేస్తున్నాడు. జపాన్‌లో బాహుబలి ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నా.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా... డైరెక్టర్ సందీప్ వంగా లైక్ చేశారు. నెటిజన్లు సైతం లైక్స్ చేస్తూ ప్రభాస్ క్రేజ్ అంటే ఇదీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : సంక్రాంతి బరిలో 'అఖండ 2'! - నిర్మాత రామ్ అచంట ట్వీట్‌కు అర్థమేంటి?

ప్రభాస్‌కు గ్రాండ్ వెల్ కం

'స్పిరిట్' మూవీ షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ 'బాహుబలి ది ఎపిక్' ప్రమోషన్లలో భాగంగా జపాన్ వెళ్లారు. అక్కడ ఫ్యాన్స్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. జపాన్‌కు స్వాగతం, లవ్ యూ డార్లింగ్ అంటూ ప్లకార్డులు పట్టుకుని వెల్ కం చెప్పారు. స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా థియేటర్లో సందడి చేశారు. 'బాహుబలి జయహో' అంటూ జపనీస్ అభిమానులు ఆయనకు జేజేలు పలికారు. అందరికీ అభివాదం చెబుతూ మిస్టర్ కూల్‌గా కనిపించారు ప్రభాస్. జపనీస్ భాషలో బాహుబలి క్యారెక్టర్స్, బొమ్మలతో ఏర్పాటు చేసిన బోర్డులు చూసి ఆశ్చర్యపోయారు. వాటిపై ఆయన ఆటోగ్రాఫ్ చేశారు.

బాహుబలిలోని డైలాగ్స్‌తో ప్రభాస్ సందడి చేయగా... ఫ్యాన్స్ ఈలలు, కేకలతో ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.