Balakrishna Akhanda 2 Release Date : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ డేట్‌పై రూమర్స్ వస్తోన్న నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ ఫామ్ 'బుక్ మై షో' యాప్‌ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ, నిర్మాతల నుంచి ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి అలా అప్డేట్ చేసిందా? అనేది తెలియాల్సి ఉంది.

Continues below advertisement

సంక్రాంతి బరిలో...

'బుక్ మై షో' అప్డేట్ ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి 'అఖండ 2' ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది. వివాదం ఇంతవరకూ సద్దుమణగకపోవడంతో ఈ తేదీ అంచనా వేసినట్లుగానే కనిపిస్తోంది. గతంలో బాలయ్య ఎన్నో సినిమాలు సంక్రాంతికి రిలీజై మంచి హిట్ సొంతం చేసుకున్నాయి. దీనికి తోడు నిర్మాత రామ్ అచంట తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'త్వరలోనే బ్లాక్ బస్టర్ తేదీతో వస్తాం' అంటూ రాసుకొచ్చారు.

Continues below advertisement

దీంతో 'బుక్ మై షో' అప్డేట్‌ను ఉద్దేశించే ఆయన ఈ ట్వీట్ చేశారంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈసారి పెద్ద పండుగకు బాక్సాఫీస్ బరిలో గట్టి పోటీ నెలకొనడం ఖాయంగానే కనిపిస్తోంది. చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'తో పాటు ప్రభాస్ 'ది రాజా సాబ్' కూడా రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి'తో పాటు నవీన్ పోలిశెట్టి... 'అనగనగా ఒక రాజు' మూవీ కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది.

Also Read : రాజమౌళి 'వారణాసి' ఓటిటి హక్కుల కోసం తీవ్ర పోటీ! 1000 కోట్లు దాటి వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా!

ఫ్యాన్స్ వెయిటింగ్

గురువారం ప్రీమియర్ షోస్‌తో 'అఖండ 2' రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఫ్యాన్స్‌కు, మూవీ లవర్స్‌కు చిత్ర నిర్మాణ సంస్థ క్షమాపణలు చెప్పింది. 14 రీల్స్ ప్లస్ సంస్థకు ఎరోస్ సంస్థకు గత సినిమాలకు సంబంధించి లావాదేవీలు పెండింగ్‌లో ఉండగా ఆ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు స్టే విధించింది. అయితే, ఇది బయటే సెటిలై రిలీజ్ అవుతుందని భావించినా సాధ్యం కాలేదు.

ఈ క్రమంలో ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు రంగంలోకి దిగారు. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలిపారు. ఆర్థిక లావాదేవీల విషయం బయట చెప్పకూడదని... ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరోవైపు అవిశ్రాంత ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు అత్యంత షాకింగ్ విషయాలు జరుగుతాయని... వరల్డ్ వైడ్ ఫ్యాన్స్‌కు సారీ చెబుతున్నట్లు 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేసింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'అఖండ 2' ట్రెండ్ అవుతూనే ఉంది. మూవీ ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.