Balakrishna Akhanda 2 New Release Date : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ ఎప్పుడు?... ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ దగ్గర నుంచీ మూవీ లవర్స్ వరకూ అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇది. వివాదం సద్దుమణిగిందని రేపు మాపో రిలీజ్ ఉంటుందని వార్తలు వచ్చినా దేనిపైనా క్లారిటీ లేదు. ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ కీలక ప్రకటన చేసింది.

Continues below advertisement

రిలీజ్ డేట్... క్లారిటీ

'అఖండ 2'ను పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి తాము తమ వంతు ప్రయత్నం చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. 'మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు అత్యంత షాకింగ్ విషయాలు జరుగుతాయి. కానీ ఇది చాలా బ్యాడ్ టైం. వరల్డ్ వైడ్‌గా ఉన్న ఫ్యాన్స్, మూవీ లవర్స్ అందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. వారు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న సంగతి తెలుసు.

Continues below advertisement

ఈ సవాల్‌తో కూడిన టైంలో మాకు తోడుగా నిలిచినందుకు మా ప్రియమైన 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులకు మేము ఎప్పటికీ కృతజ్ఞులం. అఖండ 2 వచ్చినప్పుడు హైప్ మామూలుగా ఉండదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం.' అంటూ రాసుకొచ్చింది.

Also Read : రాజమౌళి 'వారణాసి' ఓటిటి హక్కుల కోసం తీవ్ర పోటీ! 1000 కోట్లు దాటి వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా!

త్వరలోనే సమస్య పరిష్కారం

ఆర్థిక లావాదేవీలే సినిమా రిలీజ్ వాయిదాకు కారణం కాగా త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు అన్నారు. ఈ మూవీ కోసం బ్యాక్ ఎండ్‌లో చాలామంది శ్రమిస్తున్నారని... అయితే, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రాసేస్తున్నారని ఇది సరికాదని చెప్పారు. ఆర్థికపరమైన సమస్యలు బయటకు వెల్లడించలేమని... అసలు అవన్నీ అనవసర ప్రస్తావనలనీ వెల్లడించారు. 

రిలీజ్ ఎప్పుడు?

'అఖండ 2' రిలీజ్ ఎప్పుడు అనే దానిపై విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 18న రిలీజ్ చేస్తారనే ప్రచారం ముందు సాగినా... ఆ తర్వాత క్రిస్మస్ బరిలో నిలుస్తుందనే టాక్ వినిపించింది. మరోవైపు, సంక్రాంతికే మూవీ రిలీజ్ అవుతుందని కొందరు చెబుతున్నారు. అదే నిజమైతే ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది.

ఇక చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్, ఎరోస్ సంస్థకు మధ్య గత సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలే కారణం కాగా... లోకల్ ఫైనాన్షియర్స్ హస్తం సైతం ఉన్నట్లు టాక్ వినిపించింది. ఎరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో మూవీ రిలీజ్‌పై స్టే విధించింది. 14 రీల్స్ ప్లస్ సంస్థ వారికి రూ.28 కోట్లు ఇవ్వాలనే అది వడ్డీతో కలిపి ఓ చిన్న సినిమా బడ్జెట్‌కు ఈక్వెల్ అయ్యిందని ఫిలింనగర్ వర్గాల టాక్. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియాల్సి ఉంది.