ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో తన మ్యూజిక్ తో సంగీత ప్రియులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆయన హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 'కీరవాణి నా టూర్ ఎంఎంకె లైవ్ ఇన్' కాన్సర్ట్ మార్చ్ నెలలోనే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే దర్శక దిగ్గజం జక్కన్న కీరవాణికి తన డిమాండ్ ఏంటో చెప్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఈ లైవ్ ఇన్ కాన్సర్ట్ లో తనకేం కావాలో జక్కన్న వెల్లడించారు.
కీరవాణికి జక్కన్న డిమాండ్
'కీరవాణి నా టూర్ ఎంఎంకె లైవ్ ఇన్' కాన్సర్ట్ హైదరాబాద్లోని హైటెక్స్ లో మార్చ్ 22న భారీ ఎత్తున జరగనుంది. ఈ మేరకు కీరవాణి కాన్సర్ట్ పై జక్కన్న స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కీరవాణి కాన్సర్ట్ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రాజమౌళి చెప్పుకొచ్చారు. "కీరవాణి ఎంఎంకె లైవ్ ఇన్ కాన్సర్ట్ కోసం నేను ఉత్సాహంగా ఉన్నాను. మార్చి 22 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆరోజు హైదరాబాద్ టాకీస్ కీరవాణి కాన్సర్ట్ ను ప్రజెంట్ చేస్తోంది. అయితే ఈ టూర్ లో కీరవాణి నా సినిమాలోని పాటలతో పాటు ఆయన కంపోజ్ చేసిన పాటలు అన్నింటికీ పర్ఫామెన్స్ ఇస్తారు. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం కీరవాణి మన కోసం సరికొత్త మ్యూజిక్ ని, పాటలను క్రియేట్ చేస్తున్నారు. కానీ నా డిమాండ్ ఏంటంటే కేవలం పాటలు మాత్రమే కాదు నాకు ఓఎస్టీస్ కావాలి. తన ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ స్కోర్స్... నా సినిమాలతో పాటు ఇతర సినిమాల్లో కూడా చాలా చాలా ఉన్నాయి. వాటిపై తను పర్ఫార్మ్ చేయాలి అనేది నా కోరిక. మీరు కూడా నాతోపాటు కీరవాణిని ఓఎస్టిస్ పై పర్ఫార్మెన్స్ ఇవ్వమని డిమాండ్ చేయండి. ఎందుకంటే ఆయన పాటలు ఎంత పాపులరో ఆయన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు పర్సనల్ గా అంతకంటే ఎక్కువ పాపులర్ అనిపిస్తాయి. కాబట్టి ఆయన ఓఎస్టి కూడా పర్ఫామ్ చేయాలి. నేను మార్చి 22న రాత్రి 7 గంటలకు జరగనున్న ఈ కాన్సర్ట్ గురించి వెయిట్ చేస్తున్నాను" అని జక్కన్న వెల్లడించారు. మరి జక్కన్న డిమాండ్ కి కీరవాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: స్టార్ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?
'నాటు నాటు'గా భారత్ కు ఆస్కార్
ఇదిలా ఉండగా రాజమౌళి 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఎక్కువగా కీరవాణితోనే కలిసి పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటిదాకా మగధీర, విక్రమార్కుడు, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలలోని చార్ట్ బస్టర్ ఆల్బమ్, ఓఎస్టిల గురించి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' మూవీలో కీరవాణి మ్యూజిక్ అందించిన 'నాటు నాటు' పాట భారతదేశానికి మొట్టమొదటి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో 'ఎస్ఎస్ఎంబి 29' రూపొందుతోంది. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.