SS rajamouli review on Kalki 2898 AD Release Trailer: ప్రస్తుతం ఇండియా వైడ్‌గా 'కల్కి 2898 AD' మేనియానే కనిపిస్తుంది. నిన్న (జూన్‌ 21) విడుదలైన రిలీజ్‌ ట్రైలర్‌ మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తుంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, విజనరి డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో పాన్‌ వరల్డ్‌ తెరకెక్కింది ఈ సినిమా. అత్యంత భారీ బడ్జెట్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందిన కల్కి జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతుంది. మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మూవీ టీం రోజురోజుకు ఒక్కొక్క అప్డేట్‌ వదుతూ మూవీపై బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.


ఇందులో భాగంగా గురువారం సెకండ్‌ ట్రైలర్‌ను విడుదల చేయగా దీనికి అన్ని వర్గాల ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వస్తుంది. సాధారణ ఆడియన్స్‌ నుంచి సినీ సెలబ్రిటీలు సైతం ట్రైలర్‌పై స్పందిస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌తో విజువల్‌ ట్రీట్‌ ఇచ్చిందంటున్నారు. తాజాగా ఈ ట్రైలర్‌పై దర్శక ధీరుడు జక్కన కూడా స్పందించారు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. "పవర్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌ ఇది. ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూసేందుకు ఈ ట్రైలర్‌ మరింత ఆసక్తిని రేకిస్తోంది. అమితాబ్‌ జీ, డార్లింగ్‌ ప్రభాస్, దీపాక పాత్రలు చాలా డెప్త్‌ని కలిగి ఉంటాయని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది.






ఇక కమల్‌ సర్‌ లుక్‌ చూసి నేను షాక్‌ అయ్యాను. ఇప్పటికీ ఆ సాక్‌ నుంచి బయటపడలేకపోతున్నా. ఎప్పటిలాగే ఆయన తన పర్ఫామెన్స్‌తో ఎలా ఆశ్చర్యపడుస్తాడో చూడాలి. ఇక నాగి.. జూన్‌ 27న నీ అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశించడానికి వేచి ఉండలేకపోతున్నా" అంటూ జక్కన్న ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ హాట్ టాపిక్‌గా నిలిచాయి. సెకండ్‌ ట్రైలర్‌పై జక్కన్న ఇచ్చిన రివ్యూ కల్కి మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక కల్కి సెకండ్‌ ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి నాగ్‌ అశ్విన్‌ పనితీరును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. కల్కి విషయంలో ఆయన విజనరిని కొనియాడుతున్నారు. 



ఇదిలా ఉంటే డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ వరల్డ్‌ ఆఫ్‌ కల్కి పేరుతో మూవీ కథను ఆడియన్స్‌కి పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. వరుసగా వీడియోలు షేర్‌ చేస్తూ అసలు కల్కి కథ ఏంటీ, ఈ కథ తనకు ఎలా తట్టిందో వివరించారు. ఈ మూవీ కలియుగంలో కల్కి కథ, ఇది ప్రపంచానికి ముగింపు కథ అన్నారు. అంతేకాదు మూడు ప్రపంచాల మధ్య ఈ కథ సాగుతుందని చెప్పి సినిమా బజ్‌ పెంచారు. ఇక ఇందులోని పాత్రలన్నిటికి ప్రాధాన్యత ఉంటుందని కల్కి ట్రైలర్‌ చూస్తుంటే అర్థమైపోంది. కాగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో కల్కిని నిర్మించారు నిర్మాత అశ్వినీ దత్‌. ఈ సినిమాకు దాదాపు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు సమాచారం.


Also Read: నెల రోజుల ముందే ఓటీటీకి వచ్చేస్తున్న కార్తికేయ హిట్‌ మూవీ! - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..