Bhaje Vaayu Vegam Movie OTT Release Date: యంగ్‌ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్‌ మూవీ 'భజే వాయు వేగం'. యాక్షన్‌ థ్రిల్లర్‌గ డైరెక్టర్‌ ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా మే 31న విడుదలైన మంచి విజయం సాధించింది. కొంతకాలంగా హిట్స్‌ లేని కార్తికేయ ఈ మూవీ సాలిడ్‌ హిట్‌ ఇచ్చింది. ఫస్ట్‌డే డిసెంట్‌ వసూళ్లు చేసిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో మెల్లిమెల్లిగా పంజుకుంది. దీంతో థియేట్రికల్‌ రన్‌లో ఈ మూవీ కలెక్షన్స్‌ పెంచుకుంటూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోయింది. మొత్తానికి చాలా గ్యాప్‌ కార్తికేయకు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు రెడీ అవుతుందట.


ఓటీటీ రిలీజ్ డేట్..


విడుదలైన నెల రోజులకే ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుందంటూ తాజాగా ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భజే వాయువేగం మూవీ డిజిటల్‌ రైట్స్‌ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్టిక్స సొంతం చేసుకుంది. మూవీ మంచి విజయం సాధించిన భారీ ధరకే మూవీ ఓటీటీ రైట్స్‌ని కోనుగోలు చేసినట్టు సమాచారం. ఇక ఈ మూవీ థియేట్రికల్‌ రన్‌ టైం పూర్తి చేసుకోవడంతో త్వరలోనే చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ చేస్తుందట. ఈ నెల జూన్‌ 28న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకోవచ్చే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారట. త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.


కాగా ఈ మధ్య హిట్‌ సినిమాలైన కూడా నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 'భజే వాయు వేగం' కూడా నెల తిరక్కుండానే ఓటీటీలోకి రాబోతుందట. ఇది తెలిసి డిజిటల్‌ ప్రియులు ఖుష్‌ అవుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలిందే. కాగా ఈ సినిమాలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇక హ్యాపీ డేస్‌ ఫేం రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, కృష్ణ చైతన్య, సుదర్శన్,శరత్ లోహితస్వ, రవిశంకర్, కీలకపాత్రలు పోషించారు. యూవీ కాన్సెప్ట్ పతాకంపై నిర్మించిన ఈ మూవీకి రదన్, కపిల్ కుమార్ సంగీతం అందించారు. 


భజే వాయు వేగం కథ విషయానికి వస్తే..


వెంకట్ (కార్తికేయ గుమ్మకొండ) తల్లిదండ్రులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో తన తండ్రి స్నేహితుడైన తనికెళ్ల భరణి అతడిని పెంచే బాధ్యతలను తీసుకుంటాడు. కన్న కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో సమానంగా పెంచుతారు. వెంకట్‌ను క్రికెటర్‌ చేయాలని, రాజును మంచి ఉద్యోగంలో చూడాలని పొలం అమ్మి మరీ హైదరాబాద్ పంపిస్తాడు. కానీ వెంకట్ క్రికెట్  ఆడకుండ బెట్టింగ్‌ చేస్తుంటాడు. మరోవైపు రాజు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అని చెప్పి ఫైవ్ స్టార్ హోటల్ వాలెట్ పార్కింగ్ డ్రైవర్‌గా పని చేస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండ వెంకట్, రాజులు డ్రగ్‌ స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కుంటారు. అసలు వెంకట్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ఎందుకు చేశాడు? రాజు డ్రైవర్‌ చేయడానికి కారణమేంటి? అసలు వారు డ్రగ్‌ కేసులో ఎలా ఇరుక్కున్నారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


Also Read: నటి పూనమ్‌ కౌర్‌ సంచలన కామెంట్స్‌ - ఏపీ రాజకీయాలను ఉద్దేశించేనా? ఆ ట్వీట్‌ అర్థమేంటి...