Raja Ravindra's Saarangadariya Movie Latest Updates: ప్రముఖ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన ఫ్యామిలీ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'సారంగదరియా'. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మహమ్మద్, మోహిత్ పేడాడ ప్రధాన తారాగణం. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ చేతుల మీదుగా విడుదల అయ్యింది.
కుల మతాలకు అతీతమైన ప్రేమ...
Saarangadariya Trailer Review: రాజా రవీంద్రతో పాటు మిగతా పాత్రలను ట్రైలర్ ప్రారంభంలో పరిచయం చేశారు. వాళ్ళ సంతోషాన్ని, బాధను... రెండిటిని పక్క పక్కనే చూపించారు.
'సారంగదరియా' ట్రైలర్ చూస్తే... సినిమాలో రాజా రవీంద్ర టీచర్ రోల్ చేసినట్టు అర్థం అవుతోంది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది? అనేది సినిమా. రాజా రవీంద్ర కుమారుడిగా నటించిన మోహిత్, ముస్లిం యువతితో ప్రేమలో పడతాడు. ఆమె ఇంట్లో పెద్దలను ఒప్పించడం కోసం సున్తీ చేయించుకుంటాడు. మరొక కుమారుడు కులం గురించి చెప్పాడు. రాజా రవీంద్ర జీవిత సత్యాలు బోధించారు. వాళ్ళ కథలు ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.
'మందు, సిగరెట్లు... పేకాట, బెట్టింగులు... వీటన్నిటి కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది. అది ఎంత వరకు అంటే... నువ్వు ఇంతే, ఇంతకు మించి నువ్వేం చెయ్యలేవని డిసైడ్ చేసి మీకే బాస్ అయ్యి కూర్చుంటుంది', 'ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతారు. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు నేర్పుతుంది' అని రాజా రవీంద్ర చెప్పే మాటల్లో లోతైన భావం ఉంది. 'కులం అంటే రక్తం కాదు సార్... పుట్టుకతో రావడానికి! మనం చేసే పనే కులం సార్!' అని ఆయన కుమారుడిగా నటించే వ్యక్తి చెప్పే మాట సైతం ఆలోచింపజేసే విధంగా ఉంది.
జూలై 12న థియేటర్లలోకి 'సారంగదరియా'
Saarangadariya Telugu Movie Release Date: 'సారంగదరియా' చిత్రాన్ని సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు ఆశీస్సులతో ఉమా దేవి, శరత్ చంద్ర ప్రొడ్యూస్ చేస్తున్నారు. పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూలై 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
ఇప్పటికే విడుదల చేసిన 'సారంగదరియా' టీజర్, లెజెండ్రీ సింగర్ కెఎస్ చిత్ర (KS Chithra) పాడిన 'అందుకోవా...' పాటతో పాటు 'నా కన్నులే...', 'ఈ జీవితమంటే...' పాటలకు సైతం మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు దర్శక నిర్మాతలు.
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మహమ్మద్, మోహిత్ పేడాడ, నీల ప్రియా, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంత బాబు, విజయమ్మ, హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అరుణాచల మహేష్, మాటలు: వినయ్ కొట్టి, కూర్పు: రాకేష్ రెడ్డి, పాటలు: రాంబాబు గోశాల - కడలి సత్యనారాయణ, సంగీతం: ఎం ఎబెనెజర్ పాల్, ఛాయాగ్రహణం: సిద్ధార్థ స్వయంభు.