Bhale Unnade First Look: యంగ్ హీరో రాజ్ తరుణ్... బ్యాక్ టు బ్యాక్ కామెడీ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో నటించినా ఆశించిన భారీ విజయాలు రాలేదు. అందుకే హీరోగా కాస్త గ్యాప్ ఇచ్చి.. నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’లో కీలక పాత్రలో నటించారు. సోలో హీరోగా ఆయన చేస్తున్న సినిమాలకు వస్తే... దర్శకుడు మారుతీకి చెందిన ‘మారుతీ టీమ్ ప్రొడక్ట్’ నిర్మాణ సంస్థలో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ రివీల్ చేశారు.
మారుతీ టీమ్ ప్రొడక్ట్..
యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో, కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో టాలీవుడ్‌లో హిట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు మారుతీ. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఓవైపు డైరెక్షన్‌లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రొడక్షన్ కూడా చేశారు. రవికిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్ వీ కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తూ.. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో తెరకెక్కుతున్న మొదటి మూవీ గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కూల్, స్టైలిష్‌గా ఉన్నా...
రాజ్ తరుణ్ హీరోగా మరుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రమే ‘భలే ఉన్నాడే’. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలయ్యింది. ఈ ఫస్ట్ లుక్‌లో చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. చూడడానికి సాఫ్ట్‌వేర్‌లాగా ఉన్న రాజ్ తరుణ్ లుక్... బ్యాక్ గ్రౌండ్‌లో మాత్రం అమ్మాయి బ్యూటీ ప్రొడక్ట్స్, చీర ఉన్నాయి. దీంతో ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉండేలా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. హీరోగా పరిచయమయిన తర్వాత రాజ్ తరుణ్ ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించినా... తన ప్రతీ చిత్రంలో వైవిధ్యభరితమైన అంశం ఉండేది. అదే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునేది. హీరోగా ‘కుమారి 21ఎఫ్’ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన రాజ్ తరుణ్‌కు ఆ తర్వాత సినిమాల్లో కొన్ని విజయాలు సాధించగా... మరికొన్ని అంతగా ఆడలేదు.
వెబ్ సిరీస్‌లతో హిట్లు కొట్టాడు..
‘భలే ఉన్నాడే’ మూవీతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవ్వనున్నాడు జే శివసాయి వర్ధన్. వెండితెరకు శివసాయి కొత్త అయినా వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఎంతోకాలంగా అలరిస్తూనే ఉన్నాడు. ‘గీతా సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి గోల 2’, ‘హలో వరల్డ్’లాంటి యూత్ ఫుల్ వెబ్ సిరీస్‌లను తెరకెక్కించి.. యూత్‌కు బాగా దగ్గరయ్యాడు శివసాయి. ఇక ఈ మూవీతో రాజ్ తరుణ్‌కు జోడీగా కృష్ణ అనే పాత్రలో మనీషా కందుకూరు పరిచయం కానుంది. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘చెప్పవే చిరుగాలి’ ఫేమ్ అభిరామి, ‘నారప్ప’ ఫేమ్ అమ్ము అభిరామి, లీలా సామ్‌సన్‌లాంటి నటీమణులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర.. ‘భలే ఉన్నాడే’కు సంగీతాన్ని అందించనున్నాడు.
Also Read: రజనీకాంత్ సినిమా అయితే బ్యాన్ చేస్తారా? - నయనతార దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్