Shhyamali De First Post After Samantha Raj Nidimoru First Post : సమంత, రాజ్ నిడిమోరు వివాహం సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయం వద్ద భూత శుద్ధి పద్ధతిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సామ్ ఈ ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కొత్త జంటకు విషెష్ చెబుతున్నారు. ఈ క్రమంలో రాజ్ మాజీ భార్య శ్యామాలి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
పెళ్లికి ముందు... ఆ తర్వాత...
సమంత, రాజ్‌ల వివాహంపై సోషల్ మీడియాలో రూమర్స్ వస్తోన్న క్రమంలో శ్యామాలి పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. 'తెగించిన వ్యక్తులు అందుకు తగినట్లుగానే వ్యవహరిస్తారు' అంటూ ఆమె చేసిన పోస్ట్ ఆ వార్తలకు బలం చేకూర్చింది. ఇక తాజాగా... 'మనం ఈ అనంత విశ్వంలో ఓ మూలన ఉన్నాం.' అనే అర్థం వచ్చేలా యూనివర్స్ ఇమేజ్ షేర్ చేశారు.
'బుుణానుబంధ రూపేణ పశుపత్నీ సుత ఆలయ బుుణక్షయే క్షమాయంతి తత్ర పరివేదన - పద్మపురాణం. మనతో రుణం ఉన్నంత వరకే మన జీవిత భాగస్వామి, పిల్లలు ఇలా అన్నీ బంధాలు మనతో ఉంటాయి. ఆ కర్మ, అప్పులు అయిపోయినప్పుడు వాటితో సంబంధం ఉన్న ఆనందాలు, దుఃఖాలు ఆగిపోతాయి. రుణం తీరిపోయిన తర్వాత బంధం శాశ్వతంగా దూరమవుతుంది.' అంటూ రాసుకొచ్చారు. అయితే, 5 రోజుల క్రితమే ఈ పోస్ట్ చేయగా... దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సమంత రాజ్‌ల పెళ్లి విషయం ఆమెకు ముందే తెలుసా? అందుకే ఇలా రాసుకొచ్చారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : సమంత రాజ్ వెడ్డింగ్ - ఆమె చేతి రింగ్ వెరీ వెరీ స్పెషల్... ముందే హింట్ ఇచ్చారా?