Raghuvaran BTech Re-release: థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్, బుక్ మై షోలో సోల్డ్ అవుట్ - ధనుష్ సినిమాకు భారీ క్రేజ్

ధనుష్ హీరోగా నటించిన 'రఘువరన్ బీటెక్' ఈ వారమే రీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు తెలుగులో విపరీతమైన క్రేజ్ నెలకొంది.

Continues below advertisement

తెలుగు ప్రేక్షకుల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్న తమిళ హీరోల్లో జాతీయ పురస్కార గ్రహీత ధనుష్ (Dhanush) ఒకరు. ఆయన కథానాయకుడిగా నటించిన 'రఘువరన్ బీటెక్' (Raghuvaran Btech Movie) సినిమా ఈ వారం తెలుగులో రీ రిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్, టికెట్ బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తే... ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు కూడా అంత బజ్ లేదని చెప్పాలి. 

Continues below advertisement

వందకు పైగా థియేటర్లలో రీ రిలీజ్!
'రఘువరన్ బీటెక్'ను శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ తెలుగులో విడుదల చేశారు. అప్పట్లో ఈ సినిమా జనవరి 1, 2015లో విడుదల అయ్యింది. సంచలన విజయం సాధించింది. నిజం చెప్పాలంటే... తమిళంలో విడుదలైన ఆరు నెలల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చింది. 

'రఘువరన్ బీటెక్' మాతృక, తమిళ సినిమా 'వేలై ఇళ్ళ పట్టదారి' జూలై 18, 2014లో విడుదల అయ్యింది. స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, అందులో కాన్సెప్ట్ నచ్చడంతో 'స్రవంతి' రవికిశోర్ తెలుగులో విడుదల చేశారు. ఆయన నమ్మకం నిజమైంది. తెలుగు ప్రేక్షకులకూ సినిమా నచ్చింది. అంతే కాదు, ధనుష్ కంటూ మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడీ సినిమాను శుక్రవారం (ఆగస్టు 18న) రీ రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు 'స్రవంతి' రవికిశోర్ చెప్పారు. 

ఆంధ్ర, సీడెడ్, నైజాం... ప్రతి ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో గడిచిన 24 గంటల్లో ఆరు వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. సింగిల్ స్క్రీన్స్ దగ్గర టికెట్ కౌంటర్లలో అమ్మిన టికెట్స్ కలిపితే రీ రిలీజుల్లో 'రఘువరన్ బీటెక్' కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఉన్నాయి.

Also Read : ఆంధ్రా రాబిన్ హుడ్‌గా మాస్ మహారాజా రవితేజ ఊచకోత


  
'రఘువరన్ బీటెక్' రీ రిలీజ్ సందర్భంగా నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''మనం కొన్ని సినిమాలను ఎవర్ గ్రీన్ మూవీస్ అంటుంటాం. అటువంటి చిత్రమే 'రఘువరన్ బీటెక్'. ప్రతి తరంలో విద్యార్థులకు కనెక్ట్ అయ్యే సినిమా. స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్, కెరీర్ స్ట్రగుల్స్ గురించి బాగా డిస్కస్ చేశారు. డబ్బింగ్ డైలాగ్స్ తరహాలో కాకుండా తెలుగు వెర్షన్ కోసం దర్శకుడు కిశోర్ తిరుమల ఎంతో కేర్ తీసుకుని ఒరిజినల్ సినిమాకు రాసినట్టు మాటలు రాశారు. ధనుష్ అయితే పాత్రలో జీవించారు. ఆయనలో విద్యార్థులు తమను తాము చూసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే... ఇప్పటికీ చూసుకుంటున్నారని అనిపిస్తోంది. అనిరుధ్ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఎక్స్‌ట్రాడినరీ సాంగ్స్, రీ రికార్డింగ్ అందించారు'' అని అన్నారు.     

Also Read మీరా జాస్మిన్‌కు తెలుగులో మరో ఛాన్స్ - ఈసారి యంగ్ హీరోతో...

ధనుష్ సరసన అమలా పాల్ (Amala Paul) కథానాయికగా నటించిన ఈ సినిమాలో సురభి కీలక పాత్రధారి. హీరో తల్లిదండ్రులుగా శరణ్య, సముద్రఖని నటించారు. వివేక్, హృషికేష్, అమితాష్ ప్రధాన్ ఇతర తారాగణం. వేల్ రాజ్ దర్శకత్వం వహించారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola