రఘు కుంచే క్రియేటివ్ పర్సన్. గాయకుడిగా మంచి పేరు, విజయాలు వచ్చిన తర్వాత తనలో సంగీత దర్శకుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే స్వరకర్తగా ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ, ఆ తర్వాత నటుడిగా మారారు. ఇప్పుడు ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయ్యారు. విలన్ రోల్స్, లీడ్ రోల్స్ అని కాకుండా అన్ని క్యారెక్టర్లు చేస్తున్నారు. జూన్ 13న రఘు కుంచే (Raghu Kunche Birthday) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

'గేదెల రాజు'గా రఘు కుంచేరఘు కుంచే టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం 'గేదెల రాజు'. కాకినాడ తాలూకా... అనేది ఉప శీర్షిక (Gedela Raju Kakinada Taluka movie). రఘు కుంచే సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు చైతన్య మోటూరి దర్శకుడు. మోటూరి టాకీస్‌ పతాకంపై వాణి రవి కుమార్‌ మోటూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. రఘు కుంచే పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Also Read: 'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ డ్రామా సిరీస్ సీజన్ 2 వచ్చేసింది... ఇది ఎలా ఉందంటే?

'చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు' అనే పాయింట్ తీసుకుని సినిమా చేస్తున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు. అసలు నిజం ఏమిటి? అనేది సినిమాలో చూడాలని తెలిపారు.

Also Read'డీడీ నెక్స్ట్ లెవెల్' రివ్యూ: Zee5 ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ కామెడీ... రివ్యూ రైటర్లను టార్గెట్ చేసే దెయ్యం... సంతానం సినిమా ఎలా ఉందంటే?

రఘు కుంచే టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు రవి ఆనంద్‌ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక తదితరులు ప్రధాన  తారాగణం. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రవి ఆనంద్‌ చిన్నిబిల్లి - తాడాల వీరభద్ర రావు - గీతార్థ్‌ కుంచే, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిరణ్‌ తాతపూడి - దివ్య మోటూరి, పాటలు: గిరిధర్‌ రాగోలు - లలిత కాంతా రావు, ఎడిటర్‌: సుధీర్‌ ఎడ్ల, కళా దర్శకుడు: అమర్‌ తలారి, సంగీతం: రఘు కుంచే, నిర్మాత: వాణి రవి కుమార్‌ మోటూరి, కథ - మాటలు - స్క్రీన్‌ ప్లే - దర్శకత్వం: చైతన్య మోటూరి.