Allu Arjun Atlee Movie Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో పాన్ వరల్ట్ రేంజ్‌లో మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం 'AA22XA6' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ హీరోయిన్‌గా ఇటీవలే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తాజాగా.. మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఆ హీరోయిన్‌తో కీలక సీన్స్?
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతున్నట్లు తెలుస్తుండగా.. స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇందులో భాగమయ్యారని సమాచారం. బన్నీ, మృణాల్‌పై కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. బన్నీతో హాలీవుడ్ రేంజ్‌లో మూవీని అట్లీ ప్లాన్ చేస్తుండగా.. మొత్తం ఐదుగురు హీరోయిన్లను తీసుకోనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
పెద్ద లిస్టే ఉందిగా..
ఇప్పటివరకూ దీపికా పదుకోన్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయగా.. తాజా బజ్‌తో మృణాల్ ఈ మూవీలో పార్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇక మిగిలిన రోల్స్‌లో అనన్య పాండే, భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్‌లను తీసుకోనున్నట్లు సమాచారం. మరి దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. ఇక.. 'సీతారామం'లో సీతగా తన నటనతో తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసిన మృణాల్.. ఆ తర్వాత 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' మూవీస్‌తో మెప్పించారు. తాజాగా.. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేశారనే టాక్ హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్ 'ప్రియమణి'ని కూడా తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఓ కీలక రోల్ కోసం ఆమెను అట్లీ తీసుకుంటారని తెలుస్తోంది. గతంలో ఆమె అట్లీ 'జవాన్' మూవీలో నటించారు.
బన్నీ రోల్‌పైనే అందరి దృష్టి
సమాంతర ప్రపంచం, పునర్జన్మ బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా.. బన్నీ రోల్‌పైనే అందరి ఆసక్తి నెలకొంది. సినిమాలో ఆయన లుక్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఆయన సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకటి హీరోగా.. మరొకటి నెటిగివ్ రోల్‌లో.. ఇంకొకటి ఫుల్లీ యానిమేటెడ్‌గా ఉంటుందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ టైప్ ఆఫ్ రోల్ ఫస్ట్ టైం కానుంది.
దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తుండగా.. వీఎఫ్ఎక్స్ కీలక రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మూవీ అనౌన్స్‌మెంట్ టైంలోనే చెప్పారు మేకర్స్. సినిమాలో వీఎఫ్ఎక్స్ కోసం ఓ అంతర్జాతీయ సంస్థను సంప్రదించారు.
టైటిల్ ఏంటో..
ఈ మూవీకి బన్నీ క్రేజ్, స్టోరీకి తగ్గట్లుగా 'ఐకాన్', 'సూపర్ హీరో' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. 'ఐకాన్' అనే టైటిల్‌పైనే బన్నీతో పాటు మూవీ టీం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే టైటిల్, ఇతర అప్ డేట్స్ తెలిసే ఛాన్స్ ఉంది.