Radhka Apte About Puri Jagannadh Vijay Sethupathi Movie: విజయ్ సేతుపతి హీరోగా పూరీ జగన్నాథ్ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటివరకూ ఎవరూ చూడని డిఫరెంట్ రోల్, డిఫరెంట్ స్టోరీ అని టాక్ వినిపిస్తుండడంతో రూమర్స్ కూడా అంతే రేంజ్‌లో హల్చల్ చేస్తున్నాయి.
మూవీ రాధికా ఆప్టే.. క్లారిటీ..
ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటుల సెలక్షన్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే టబు, కన్నడ స్టార్ దునియా విజయ్‌లు నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది మూవీ టీం. అయితే.. రాధికా ఆప్టే కూడా నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా.. దీనిపై ఆమె స్పందించారు.
ఆ వార్తల్లో నిజం లేదని రాధికా ఆప్టే అన్నారు. 'ఈ సినిమాలో భాగం అయినట్లు నాకు తెలియదు. ఇలాంటి ఊహాగానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇలాంటి ప్రచారాలు ఫన్నీగా అనిపిస్తాయి. మూవీ టీం నన్ను సంప్రదించారంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకూ అలాంటిదేమీ జరగలేదు.' అని క్లారిటీ ఇచ్చారు.
Also Read: జూన్ 14న గద్దర్ సినీ అవార్డుల ప్రదానం, బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు
మరి హీరోయిన్ ఎవరు?
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. టబు నటిస్తారనే ఇప్పటికే టీం క్లారిటీ ఇవ్వగా.. ఆమె ఓ కీలక రోల్ పోషిస్తారనే అసలైన హీరోయిన్ వేరే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. రాధికా ఆప్టే పేరు వినిపించగా ఆమె తాను కాదంటూ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇంకో హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది టీం నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అటు, ఈ మూవీలో కన్నడ స్టార్ దునియా విజయ్ కూడా నటించనున్నారు. ఆయన బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' మూవీలో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి రోల్‌లో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించారు.
టైటిల్ ఏంటి?
ఈ మూవీకి 'బెగ్గర్' అనే టైటిల్ పెడతారని ప్రచారం సాగింది. అయితే, ఇటీవల ఓ ఈవెంట్‌లో విజయ్ సేతుపతి టైటిల్ ఇంకా ఏం అనుకోలేదని క్లారిటీ ఇచ్చారు. 'ఆ సినిమా పేరు ఇంకా ఖరారు కాలేదు. 'బెగ్గర్' అని మీరే టైటిల్ పెట్టేశారా?, పోస్టర్లు కూడా ఎవరో ఏఐ నుంచి తీసినవే వైరల్ అవుతున్నాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆ స్టోరీ తయారు చేసే విధానం చాలా బాగుంది. ఈ స్టోరీ ఒకేసారి కాకుండా రెండు రోజుల పాటు వినాలని అనుకున్నా. కానీ పూరీ చెబుతుంటే అలా మూడున్నర గంటలు వింటూనే ఉన్నా. ఆయనతో కలిసి మూవీ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. జూన్‌లో మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది.' అని చెప్పారు విజయ్.
ఇక.. ఈ మూవీతో పూరీ జగన్నాథ్ కమ్ బ్యాక్ కావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆయన ఖాతాలో సరైన హిట్ పడలేదు. విజయ్ సేతుపతితో పూరీ మూవీ అంటేనే ఓ స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది. అంచనాలకు అనుగుణంగానే బాక్సాఫీస్ హిట్ ఖాయమంటూ పూరీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.