మార్చి 11న 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అది పామిస్ట్ రోల్. అంటే... చేతి రేఖలు చూసి జాతకం చెప్పే వ్యక్తి అన్నమాట. విక్రమాదిత్యకు జంటగా, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇదొక ప్రేమ కథా చిత్రమని ముందు నుంచీ చెబుతున్నారు. పాటల్లోనూ ప్రేమ పరిమళాలు కనిపించాయి. అయితే... సినిమా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానంగా 'రాధే శ్యామ్' రిలీజ్ ట్రైలర్ ఉండబోతోంది.


'రాధే శ్యామ్' రిలీజ్ ట్రైలర్ నిడివి (Radhe Shyam Release Trailer Length) ఎంత? అంటే... 60 సెకన్లు. అంటే... వన్ మినిట్ మాత్రమే. ఇది సినిమాకు కర్టైన్ రైజర్ లాంటి అన్నమాట. ప్రేక్షకులకు సినిమా ఫ్లేవర్ తెలియజేయడం కోసం కట్ చేశారు. రేపు... అనగా మార్చి 2న ముంబైలో మీడియా సమక్షంలో (Radhe Shyam Release Trailer Release Function At Mumbai) ఈ రిలీజ్ ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేయనున్నారు. రేపటి నుంచి సినిమా విడుదల ముందు రోజు వరకూ... మార్చి 10 వరకూ పబ్లిసిటీ కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొనేలా ప్లాన్ చేశారు.


ఇక, రిలీజ్ ట్రైలర్ విషయానికి వస్తే... ఇప్పటి వరకూ విడుదల చేసిన విజువల్స్ కంటే మరింత గ్రాండియర్ గా విజువల్స్ ఉండబోతున్నాయట. కథ గురించి ఎక్కువ రివీల్ కాకుండా చూసుకుంటున్నారట. థియేటర్లలో ప్రేక్షకులను స‌ర్‌ప్రైజ్ చేసే ట్విస్ట్‌లు, అంశాలు రివీల్ చేయడం లేదు.


Also Read: తమన్ ట్వీట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి! ఎందుకంటే?


'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ నిర్మించిన చిత్రమిది. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.


Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు వచ్చే సంక్రాంతి పెద్ద పండగే - 'ఆదిపురుష్' రిలీజ్ డేట్ వచ్చేసింది