Raayan Movie Twitter Review: ధనుష్ సినిమా 'రాయన్'కు తెలుగులో లో బజ్ ఉంది. అంత హైప్ రాలేదు. కానీ, తమిళనాడులో ఒక రేంజ్ సందడి నెలకొంది.  ఎర్లీ మార్నింగ్ షోలు వేస్తున్నారు. బుక్ మై షో యాప్ చూస్తే గడచిన 24 గంటల్లో లక్షకు పైగా టికెట్లు అమ్ముడు అయ్యాయి. సినిమా ట్రెండింగ్‌లో ఉంది. ధనుష్ హీరోగా నటించడం మాత్రమే కాదు, ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించడం వల్ల ఆయన అభిమానుల్లో క్రేజ్ నెలకొంది. కానీ, ట్విట్టర్ టాక్ ఇంకా బయటకు రాలేదు. అందుకు కారణం అమెరికాలో ప్రీమియర్ షోలు ఆలస్యంగా వేస్తుండటం. 


ప్రీమియర్లు లేవు. కానీ, హిట్ టాక్!
తెలుగు సినిమాలకు ఇండియాలో తెల్లారే సరికి అమెరికాలో ప్రీమియర్ షోలు పూర్తి కావడం, సినిమా రిపోర్ట్ రావడం జరుగుతుంది. కానీ, ధనుష్ 50వ సినిమా 'రాయన్' ప్రీమియర్లు ఇంకా పడలేదు. అయితే... డిస్ట్రిబ్యూటర్లతో పాటు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్ కొంత మంది సినిమా చూశారట. స్పెషల్ షో వేసుకున్నారట. అక్కడి నుంచి సినిమాకు హిట్ టాక్ వస్తోంది.


Also Read: బ్లడీ ఇష్క్ రివ్యూ - Hotstarలో అవికా గోర్ హారర్ ఫిల్మ్ - ఈ ఎఫైర్స్ ఏంటి డాడీ బ్రో?














తమిళనాడు థియేటర్లలో మొదలైన సందడి!
తమిళనాడులో ధనుష్ (Dhanush Raayan Review)కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అక్కడ ఎర్లీ మార్నింగ్ షోలు పడుతున్నాయి. పలు థియేటర్ల దగ్గర భారీ సందడి నెలకొంది. భారీ కటౌట్లు, డప్పుల చప్పుళ్ళు, టపాసులతో మోత మోగుతున్నాయి. చెన్నై నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ధనుష్, విలన్ రోల్ చేసిన ఎస్.జె. సూర్య అదరగొట్టారట.


Also Read: శృతి హాసన్ @ 15 - ఐరన్ లెగ్ నుంచి పాన్ ఇండియా గోల్డెన్ లెగ్ వరకు... జర్నీ అంత ఈజీ కాదు బాస్



తమిళ హీరోలు సూర్య, కార్తీ, సంగీత దర్శకులు జీవీ ప్రకాష్ కుమార్, అనిరుద్ రవిచందర్ సహా తెలుగు హీరో సాయి ధరమ్ తేజ్ తదితరులు 'రాయన్' హిట్ కావాలని కోరుకుంటూ ట్వీట్లు చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, దుషారా విజయన్ తదితరులు నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.