నటుడు గగన్ బాబు (Gagan Babu) పేరు చెబితే ప్రేక్షకులు కొందరు గుర్తు పడతారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ 'పుష్ప', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హిట్ 'పెద్ది' సినిమాల్లో కనిపించారు. అంతకు ముందు 'ధర్మపురి'లో హీరోగా నటించారు. ఇప్పుడీ నటుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. విలన్ రోల్స్ కాకుండా పోలీస్ రోల్స్ చేస్తున్నారు. కొత్త లుక్కులోకి మారారు. 

Continues below advertisement

వరలక్ష్మి 'జంగా'లో పోలీసుగా గగన్ బాబుత్రిగుణ్ (అరుణ్ ఆదిత్) హీరోగా రూపొందుతున్న సినిమా 'జంగా'. ఇందులో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రధారి. ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు గగన్ బాబు. ఇటీవల ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమా తనకు కొత్త అవకాశాలు తీసుకు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: Idupu Kayitham Controversy Explained - ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??

Continues below advertisement

ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీమతి వనిత కిలారీ సమర్పణలో 'జంగా' చిత్రాన్ని రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారీ నిర్మిస్తున్నారు. కెవిన్ గడ్డం కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. త్రిగుణ్ పుట్టినరోజుకు మోషన్ పోస్టర్ విడుదల చేసిన టీమ్, ఇప్పుడు గగన్ బాబు పుట్టిన రోజుకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. సుకుమార్ దగ్గరకు వెళ్లి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు గగన్. ఆయనకు సుక్కు ముద్దు పెట్టిన వీడియో వైరల్ అయ్యింది.

Also Read: Idupu Kayitham Meaning - ఇడుపు కాయితం అంటే ఏమిటి? దీనికి తెలంగాణలో ఇంకేం అర్థాలు ఉన్నాయ్?

'జంగా'లో పోలీస్ ఆఫీసర్‌గా పవరు ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. సీఐ రోహిత్‌ పాత్రలో గగన్ బాబు పాత్ర సినిమాకు హైలైట్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.

Jangaa Movie Cast And Crew: త్రిగుణ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గగన్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'జంగా'లో మధునందన్, శివ నందన్, నాగ మహేష్, నేహా పఠాన్, శ్రావణ్ రాఘవేంద్ర, భూపాల్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్ సి. దిలీప్, కూర్పు: ప్రవీణ్ పూడి, సంగీతం: కృష్ణ సౌరభ్, సాహిత్యం: కాసర్ల శ్యామ్ - పూర్ణాచారి - కళ్యాణ్ చక్రవర్తి, మాటలు: ప్రసాద్ వర్మ - ప్రేమ్ రాజ్, కళా దర్శకుడు: రఘు కులకర్ణి, ఫైట్స్: కార్తీక్ - వెంకట్, నిర్మాణ సంస్థ: ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ, సమర్ఫణ: శ్రీమతి వనిత కిలారి, నిర్మాతలు: రమ్య కిలారి - జయచంద్ర నాయుడు కిలారి, కథ - కథనం - దర్శకత్వం: కెవిన్ గడ్డం.

Also ReadMaa Inti Bangaram Collections Day 8 - సెకండ్ వీకెండ్ కూడా సమంత కలెక్షన్స్ కుమ్ముడు... బాక్సాఫీస్‌లో బంగారానికి భారీ జంప్