ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా దూసుకుపోతుంది. సినిమా విడుదలై రెండు వారాలు అవుతున్నా.. ఇంకా ‘పుష్ప 2’ ప్రభంజనం థియేటర్ల వద్ద కొనసాగుతూనే ఉంది. దాదాపు రూ. 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. అతి తక్కువ సమయంలో ఈ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఈ సినిమా సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది. ఇక హిందీ బెల్ట్‌లో ఈ సినిమా కలెక్షన్ల సునామీకి ఇప్పుడప్పుడే అడ్డు లేదనేలా రోజు రోజుకూ కళ్లు చెదిరిపోయే కలెక్షన్లను ఈ సినిమా రాబడుతూ.. 100 ఏళ్ల బాలీవుడ్ సినీ చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ క్రాష్ చేస్తుందీ సినిమా. ఆ లెక్కల వివరాలను మేకర్స్ సైతం అధికారికంగా ప్రకటిస్తూ ఉండటం విశేషం. 


మరి థియేటర్లలో ఇలా జోరు మీదున్న పుష్పరాజ్‌పై ఇప్పుడొక వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అదేంటో తెలిస్తే.. ‘పుష్ప 2’ జాతరను ఓటీటీలోనూ ఆపడం కష్టమే అని అనుకోకుండా ఉండరు. ఇంతకీ వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలో మరో 15 నుండి 18 నిమిషాల అదనపు సన్నివేశాలను యాడ్ చేయబోతున్నారట. ప్రస్తుతం పుష్ప 2 సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు ఉండగా.. ఓటీటీలో మాత్రం 3 గంటల 40 నిమిషాల వరకు ఈ సినిమా నిడివి ఉంటుందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 


Also Read'యూఐ' రివ్యూ: ఇండియన్ పాలిటిక్స్‌పై ఉపేంద్ర సెటైర్... కామన్ ఆడియన్‌కు అర్థం అవుతుందా?


నిజంగా ఇదే జరిగితే మాత్రం.. థియేటర్లలో ఈ సినిమాను చూసిన వారంతా.. మరోసారి ఓటీటీలో వచ్చే పుష్పకి ట్యూన్ అవడం కాయం. అందులో డౌటే లేదు. అందులోనూ సుకుమార్ మరో గంట ఫుటేజీని ఎడిటింగ్ టేబుల్‌పై ఉంచేశాడనేలా వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా వచ్చిన ‘పుష్ప పుష్ప పుష్పరాజ్’ వీడియో సాంగ్‌లోనూ సినిమాలో లేని కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారు. ఇలా చూసుకుంటే.. మూడో పార్ట్ ఉన్నప్పటికీ రెండో పార్ట్‌లో ఇంకా చాలా సన్నివేశాలను తొలగించారనేది వెల్లడవుతోంది. అందులో కొన్ని సీన్లను నిజంగా ఓటీటీలో యాడ్ చేస్తే మాత్రం ఓటీటీలోనూ ఈ సినిమా.. క్రేజీ మూవీగా దూసుకెళుతుందనడంలో సందేహమే లేదు. ఆల్రెడీ చూసిన వారు కూడా.. కొత్తగా ఏం యాడ్ చేశారా? అని ఎగబడతారు. దీంతో సర్వర్లు క్రాష్ అయినా అయిపోవచ్చు. అలా ఉంది మరి బాక్సాఫీస్ వద్ద పుష్పగాడి రూల్. అయితే.. ఓటీటీలో అదనపు సీన్లను యాడ్ చేస్తారనే టాక్‌పై మేకర్స్ రియాక్ట్ అవ్వాల్సి ఉంది. 


మరోవైపు జనవరి 9న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందనే వార్తలపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ సినిమా విడుదలైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలోకి వస్తుందని నెట్‌ఫ్లిక్స్ సంస్థ వివరణ ఇచ్చింది. అంటే దాదాపు థియేటర్లలో విడుదలైన 2 నెలలకి ‘పుష్పరాజ్’ ఓటీటీ బాట పట్టనున్నాడన్నమాట. అప్పటి వరకు థియేటర్లలో ఈ పుష్పరాజ్ ఇంకెన్ని మెరుపులు మెరిపించనున్నాడో.. చూడాల్సి ఉంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్ నిర్మించింది.


Also Read'బచ్చల మల్లి' రివ్యూ: హీరోకి యూనిక్ క్యారెక్టర్ ఒక్కటే చాలా... సినిమాకు కథ, ఎమోషన్స్ అవసరం లేదా?