పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కాదు... జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలతో పాటు తెలుగు సినిమాలు చూసే జనాలకు గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక్కరే. కానీ, ఇప్పుడు ఆ పేరుతో మరొక యంగ్ హీరో వస్తున్నాడు. అతడి పేరు బత్తుల పవన్ కళ్యాణ్. అతని సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
స్వేచ్ఛ కోసం భర్త పోరాటం...ఏమిటీ పురుష? ఎందుకీ హడావిడి!బత్తుల పవన్ కళ్యాణ్ (Battula Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'పురుషః' (Purusha Movie). త్వరలో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. అందుకోసం డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తోంది టీం.
ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది - ఇది సాధారణంగా వినిపించే మాట. కానీ 'పురుషః' టీం 'ప్రతి మగాడి యుద్ధం వెనుక ఓ మహిళ ఉంటుంది', 'స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం' అంటూ డిఫరెంట్ క్యాప్షన్స్‌తో కూడిన పోస్టర్లు విడుదల చేస్తోంది. 'వైఫ్ వర్సెస్ పీస్ మ్యాన్' అంటూ హీరో లుక్ కనిపించకుండా క్యూరియాసిటీ పెంచుతున్నారు.
Also Read: రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూసినోళ్లు ఏం చెబుతున్నారంటే?
'పురుష'లో ట్యాలెంటెడ్ కమెడియన్లు!'పురుషః' సినిమాను కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీశారు. ఈ సినిమాలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, 'వెన్నెల' కిషోర్, వీటీవీ గణేష్, మిర్చి కిరణ్ వంటి ట్యాలెంటెడ్ కమెడియన్స్ నటించారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఓ రోల్ చేశారు. గబి రాక్, అనైరా గుప్తా, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇదొక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చిత్ర బృందం చెబుతోంది.
పవన్ కళ్యాణ్ సరసన వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ 'పురుషః' సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల కోటేశ్వరరావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.