Biggest LED Lighiting Set For SSMB29 Project : ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అవెయిటెడ్ మూవీ 'SSMB29'. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ వరల్డ్ హై అడ్వెంచర్ థ్రిల్లర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రాజెక్టు గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతుండగా... నవంబరులో ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేస్తామన్న జక్కన్న ప్రకటనతో ప్రస్తుతం సోషల్ మీడియాలో 'SSMB29' ట్రెండ్ అవుతోంది.
బిగ్గెస్ట్ LED లైటింగ్ సెట్
ఇప్పటికే ఒడిశా, కెన్యా, నైరోబీ ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోగా ఇక కొత్త షెడ్యూల్ ప్లానింగ్‌లో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం 'వారణాసి' టెంపుల్ సెట్‌నే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్నట్లు సమాచారం. ఇందులో మహేష్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తుండగా... తాజాగా మరో భారీ సెట్ వేస్తున్నారు. దాదాపు 100 అడుగుల భారీ LED లైటింగ్ టవర్ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది శ్రమించి దీన్ని నిర్మిస్తుండగా... ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు రాజమౌళి మూవీ అంటే అట్లుంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : 'వేర్ ఈజ్ చంద్రిక?'... ఆన్సర్ రెడీ - 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది!
నవంబర్ 'SSMB29'దే
నవంబరులో SSMB29 అప్డేట్ ఉంటుందని రాజమౌళి అనౌన్స్ చేయడంతో ఫస్ట్ డే నుంచి సోషల్ మీడియాలో సందడి మొదలైపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు రాజమౌళి అండ్ టీం మొత్తం 'X'లో సరదాగా చాట్ చేస్తూ లీక్స్ ఇస్తూ భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ నెల 15న ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా ఈవెంట్‌ను టీం భారీగా ప్లాన్ చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈవెంట్ చేయనుండగా... ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.
మరి ఇంటర్నేషనల్ స్థాయిలో అప్డేట్ రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేయగా... హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ ఈవెంట్‌కు వస్తారో లేదో అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వేడుకను లక్ష మంది జనంతో భారీగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. దీంతో హైప్ పదింతలు అవుతోంది. ఎప్పుడెప్పుడు ఈవెంట్ జరుగుతుందా? అప్డేట్ ఎప్పుడు వస్తుందా? అని వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టైటిల్ అదేనా?
ఈ మూవీకి 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుండగా... మరో మూవీ కూడా సేమ్ టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే, దీనికి ముందు కానీ వెనుక కానీ ఏదో ఒకటి యాడ్ చేసి టైటిల్ ఫిక్స్ చేస్తారని సమాచారం. 2027లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ సాహస ప్రయాణంగా మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై రూ.1000 కోట్ల బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.