'ప్రాజెక్ట్ కె' టైటిల్ వెల్లడించడానికి (Project K Title Announcement) ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆల్రెడీ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ (Prabhas Look In Project K)ను చూశారు. టైటిల్ వెల్లడించడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నారు.
శాండియాగోలో 'ప్రాజెక్ట్ కె' టీమ్ సందడి!
అమెరికాలో జరుగుతున్న ప్రఖ్యాత శాండియాగో కామిక్ కాన్ 2023 ఫెస్టివల్ (San Diego Comic Con 2023)లో 'ప్రాజెక్ట్ కె' టైటిల్, గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. ఆ కార్యక్రమం కోసం ప్రభాస్ సహా లోక నాయకుడు కమల్ హాసన్, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, అందాల భామ దీపికా పదుకోన్ సహా కీలక యూనిట్ సభ్యులు అగ్ర రాజ్యంలో అడుగు పెట్టారు. హాలీవుడ్ తారలు అందరూ చేరిన చోట సందడి చేస్తున్నారు.
హైప్ పెంచుతున్న 'ప్రాజెక్ట్ కె' టీమ్!
'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ లుక్ చూస్తే... ఆయన పోరాట యోధుడిలా, కలియుగ వీరుడిగా కనిపిస్తున్నారు. ఇక, కామిక్ కాన్ 2023లో చిత్ర బృందం చేస్తున్న సందడి అయితే ఒక రేంజ్ అని చెప్పాలి. 'ప్రాజెక్ట్ కె'లో కీలకమని చెప్పే రైడర్స్ అనే ఈ క్యారెక్టర్లతో ఇదిగో ఇలా మార్చ్ ఫాస్ట్ చేయించారు ఫిల్మ్ మేకర్స్. బ్లాక్ సూట్స్ తో చూడటానికి గ్రహాంతరవాసుల్లా కనిపిస్తున్న వీరంతా తమ చేతుల్లో ఉన్న వెపన్స్ తో మూవీ ప్రమోషన్ చేయటంతో పాటు Now Begins The End అంటూ పోస్టర్లతో నానా హంగామా చేశారు.
Also Read : తమన్నా ముద్దు పేరుతో చిరంజీవి పాట పాడితే
ఇంతకీ ఈ రైడర్స్ చెబుతున్న కాన్సెప్ట్ ఏంటి? అసలు, వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారు? సైన్స్ ఫిక్షన్ జానర్ లో వస్తున్న 'ప్రాజెక్ట్ కె'ను ఎందుకు కామిక్స్ ఫెస్టివల్ లో రిలీజ్ చేస్తున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు. ప్రభాస్ లుక్ మీద మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో గ్లింప్స్ ఎలా ఉంటుంది? అసలు, వాట్ ఈజ్ 'ప్రాజెక్ట్ కె' అని డార్లింగ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ అంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. కావాలంటే డల్లాస్ సహా అమెరికాలో అనేక చోట్ల కార్లతో ర్యాలీలు చేశారు. 'ప్రాజెక్ట్ కె' అని వచ్చేలా ఇలా కార్లను నిలబెట్టి ప్రాజెక్ట్ K టీమ్ కు గ్రాండ్ వెల్కమ్ పలికారు.
Also Read : హ్యాట్రిక్ ప్లాపుల్లో ఉన్న హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
రేసులో మూడు టైటిళ్ళు!
Project K Title : 'ప్రాజెక్ట్ కె' టైటిల్ రేసులో ప్రస్తుతానికి మూడు పేర్లు ఉన్నాయి. 'కె' అంటే కాలచక్రం లేదా కలియుగం లేదా కురుక్షేత్రం అయ్యి ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 'కల్కి' అనేది కూడా వినబడుతోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ఇతర ప్రధాన తారాగణం. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial