Producer Suresh Babu About Akhanda 2 Financial Issues : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో 'అఖండ 2' రిలీజ్ వాయిదా కావడంపై ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ మూవీ రిలీజ్‌కు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థకు, ఎరోస్ సంస్థకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణమనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రియాక్ట్ అయ్యారు.
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనందు ప్రధాన పాత్రలో నటించిన సైక్ సిద్దార్థ్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో 'అఖండ 2' వాయిదా గురించి సురేష్ బాబు మాట్లాడారు. అందరూ ఎంతో కష్టపడుతున్నారని... త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
రిలీజ్‌పై ఏమన్నారంటే?
గతంలోనూ చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులే ఎదురైందని... అఖండ 2 త్వరలోనే రిలీజ్ అవుతుందనే ఆశతో ఉన్నట్లు చెప్పారు సురేష్ బాబు. 'ఈ సినిమా కోసం చాలా మంది బ్యాక్ ఎండ్‌లో చాలా కష్టపడుతున్నారు. నేను కూడా ఆ ఇష్యూ క్లియర్ చేసేందుకే వెళ్లాను. అవన్నీ ఆర్థికపరమైన సమస్యలు. బయటకు వెల్లడించలేం. అయితే, వాటి గురించి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రాస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.
ప్రతీ ఒక్కరూ అఖండ 2 రిలీజ్ వాయిదా పడడానికి ఏవేవో రీజన్స్ చెబుతున్నారు. 'అన్ని కోట్లు చెల్లించాలట. ఇన్ని కోట్లు చెల్లించాలట' అంటూ ఏదేదో రాసేస్తున్నారు. అవన్నీ అనససర ప్రస్తావనలు. మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సమస్యలు అన్నీ తొలగి మూవీ రిలీజ్ అవుతుంది.' అని చెప్పారు.
Also Read : ఓటీటీలోకి థ్రిల్లర్ సిరీస్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' - మొత్తం 50 ఎపిసోడ్స్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అసలు రీజన్స్ ఏంటంటే?
గురువారం ప్రీమియర్స్‌తో 'అఖండ 2' రిలీజ్ కావాల్సి ఉండగా... టెక్నికల్ సమస్యల వల్ల ప్రీమియర్స్ రద్దు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత అర్ధరాత్రి మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ షాక్ అయ్యారు. 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ అచంట, గోపీ అచంటలకు... ఎరోస్ సంస్థకు మధ్య గత సినిమాల ఆర్థిక లావాదేవీలే దీనికి కారణమనే వార్తలు వచ్చాయి.
దీంతో పాటే 'అఖండ 2' లోకల్ ఫైనాన్షియర్స్ హస్తం సైతం ఉన్నట్లు రిలీజ్‌కు అడ్డు పడ్డారనే వార్తలు వస్తున్నాయి. అటు ఎరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో రిలీజ్‌పై స్టే విధించింది. చిత్ర నిర్మాణ సంస్థ వారికి రూ.28 కోట్లు ఇవ్వాలని తెలుస్తోంది. దీంతో పాటే ఆరేళ్ల వడ్డీతో కలిపి ఓ చిన్న సినిమా బడ్జెట్‌తో ఈక్వెల్‌గా అమౌంట్ సెటిల్ చేయాల్సి ఉందని ఫిలింనగర్ వర్గాల టాక్. అందుకే సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై మూవీ రిలీజ్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.