Ashwin Kumar's Dhoolpet Police Station Series OTT Streaming : ఓటీటీ ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్ పంచేందుకు మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. నగరంలో వరుస హత్యలను ఛేదించే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది.
ఎన్ని ఎపిసోడ్స్ అంటే?
ఈ వెబ్ సిరీస్ మొత్తం 50 ఎపిసోడ్స్ కాగా ఈ నెల 5 నుంచి ప్రతీ శుక్రవారం నుంచి కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. రాత్రి 7 గంటలకు అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో రానుంది. సిరీస్‌కు జెస్విని దర్శకత్వం వహించగా... అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, గురు, ప్రీతి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అశ్వతన్ మ్యూజిక్ అందించారు.
Also Read : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
స్టోరీ ఏంటంటే?
ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి మూడు హత్యలు జరిగితే ఆ కేసును ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేశారనేదే ఈ సిరీస్ స్టోరీ అని తెలుస్తోంది. నగరంలో ఒకే రాత్రి జరిగిన 3 హత్యల కేస్ సాల్వ్ చేసేందుకు ఏసీపీ అశ్విన్ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత అతనికి సపోర్ట్‌గా మరో ఏపీసీ కూడా వస్తాడు. ఈ క్రమంలో కేసు విచారణ వేగవంతం అవుతుంది. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? దీని వెనుక క్షుద్రపూజలు, నరబలులు ఏమైనా ఉన్నాయా? అనేది సస్పెన్స్.