Producer SKN Clarified About Controversial Comments On Telugu Heroines: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' (Return Of The Dragon) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (SKN) తెలుగు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నెట్టింట పెద్ద రచ్చే సాగింది. ఈ క్రమంలో స్పందించిన ఆయన.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 'సరదా కోసమో, ఫ్లోలో చెప్పడంలోనే ఓ కాంట్రవర్శీకి రూట్ వేసే స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ.. దాన్ని హీరోయిన్ వైష్ణవీ చైతన్యకు ముడిపెట్టి చూడడం సరికాదేమో?' అని ఓ రిపోర్టర్ 'ఎక్స్' వేదికగా పోస్ట్ పెట్టగా ఎస్కేఎన్ సమాధానం ఇచ్చారు. 'ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఏం చేస్తాం చెప్పండి.' అంటూ రిప్లై ఇచ్చారు. 

Also Read: 'అమరన్' హీరో శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ - అదిరిపోయే టైటిల్ ఫిక్స్, గ్లింప్స్ చూశారా!

అసలేం జరిగిందంటే..?

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కించగా.. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ నెల 21 తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. 'తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలని మేము ఎక్కువగా ఇష్టపడతాం. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అందుకని తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేయాలని నేను, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ అనుకుంటున్నాము' అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

దీంతో ఈ నిర్మాత అసలు ఎవరి గురించి ఈ కామెంట్స్ చేశారంటూ నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. ఎస్కేఎన్, సాయిరాజేష్ కాంబోలో వచ్చిన మూవీ 'బేబీ'. ఆ మూవీ హీరోయిన్ వైష్ణవీ చైతన్యను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు. 'బేబీ' దర్శక నిర్మాతలను ఆమె ఇబ్బంది పెట్టిందని.. అందుకే ఇలాంటి కామెంట్స్ చేశారని కామెంట్ చేశారు. తాజాగా, దీనిపై ఆయన వివరణ ఇచ్చారు.

Also Read: 3 రోజులుగా ఆస్పత్రిలోనే సుడిగాలి సుధీర్ - అసలు కారణం ఏంటి.?, ధనరాజ్ ఎందుకు అంత ఎమోషన్ అయ్యారు?