Bahubali 1 Re Release: మరోసారి థియేటర్లలోకి 'బాహుబలి' - పదేళ్ల తర్వాత అదే రోజున థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు!
Shobu Yarlagadda:డార్లింగ్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి బ్లాక్ బస్టర్ 'బాహుబలి' మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు నెట్టింట నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చేశారు.

Shobu Yarlagadda Confirms Of Baahubali Re Release: 'బాహుబలి' (Baahubali).. ఈ మూవీ అంటేనే తెలుగు సినీ పరిశ్రమకు ఓ గర్వం. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లి.. ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసింది. దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli) సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది ఈ సినిమా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను (Prabhas) భారతీయ అగ్ర హీరోగా నిలబెట్టింది.
ఆ రోజునే రీ రిలీజ్
బాక్సాఫీస్ హిస్టరీలోనే అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'బాహుబలి' ఫ్రాంచైజీ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతున్న క్రమంలో బ్లాక్ బస్టర్ 'బాహుబలి'ని రీ రిలీజ్ చేయాలని నెటిజన్లు నిర్మాత శోభు యార్లగడ్డను (Shobu Yarlagadda) సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేయగా తాజాగా ఆయన దీనిపై స్పందించారు. ఈ ఏడాదిలోనే బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలను రీ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. 2015లో జులై 10న 'బాహుబలి 1' రిలీజ్ కాగా.. పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అదే రోజున రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రకటనతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోసారి వెండితెరపై విజువల్ వండర్‌ను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీ రిలీజ్‌తో ఇప్పటివరకూ ఉన్న పాన్ ఇండియా రికార్డులన్నీ బద్దలవుతాయని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. బాహుబలి ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ.2,400 కోట్లకు పైగా వసూలు చేసింది. 2015లో విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' రూ.650 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2017లో విడుదలైన 'బాహుబలి: ది కన్‌క్లూజన్' రూ.1800 కోట్ల వసూళ్లు సాధించింది.
మాహిష్మతి సామ్రాజ్యాధినేతగా శివుడు..
మాహిష్మతి సామ్రాజ్యం కోసం జరిగే పోరాటం, తన తండ్రి బాహుబలిని మోసంతో చంపిన బళ్లాలదేవుడిని శివుడు ఎలా చంపాడు..?, తన తండ్రి వారసత్వంగా సామ్రాజ్య పీఠాన్ని తిరిగి ఎలా అధిరోహించాడు..? అనేది రెండు పార్ట్స్‌లో అద్భుతంగా చూపించారు రాజమౌళి. ఫస్ట్ పార్ట్‌లో మాహిష్మతి సామ్రాజ్య కథ.. బళ్లాలదేవుడు ప్రజలను ఎంత క్రూరంగా పాలించాడు.? అసలు బళ్లాల దేవుడు, బాహుబలికి ఉన్న సంబంధం.?, రాజమాత శివగామి ఎందుకు శిశువుగా ఉన్న శివుడిని ఎత్తుకుని రాజ్యం నుంచి పారిపోయింది..? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అనేదే హైలెట్‌గా రెండేళ్లు సస్పెన్స్ పెట్టి 'బాహుబలి ది కన్‌క్లూజన్' ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారు.
మరోవైపు, ప్రభాస్ నటింటిన 'సలార్' మూవీ సైతం ఈ నెల 21న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన పది నిమిషాల్లోనే అన్నీ టికెట్లు అమ్ముడు కావడంతో ఇదీ ప్రభాస్ క్రేజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.