యువ కథానాయకుడు అశ్విన్ బాబు (Ashwin Babu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శివం భజే' (Shivam Bhaje Movie). ఆగస్టు 1న థియేటర్లలో విడుదల అవుతోంది. విశేషం ఏమిటంటే... ఆ రోజు అశ్విన్ బాబు పుట్టిన రోజు. అంతే కాదు... గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, ఈ చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి బర్త్ డే కూడా ఆ రోజే. హీరోతో పాటు తన పుట్టిన రోజు కనుక ఆగస్టు 1న సినిమా విడుదల చేయడం లేదని, ఒక పంపిణీదారుడిగా ఆలోచించి థియేటర్లలోకి ఆ రోజు సినిమా తీసుకు వస్తున్నాయని తెలిపారు. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన చెప్పిన విశేషాలు...
ఐదు నిమిషాల్లో కథ ఓకే చేసిన అశ్విన్ బాబు!
Ashwin Babu agreed to do Shivam Bhaje within five minutes of narration: 'శివం భజే' కథను ముందు తాను విన్నానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత హీరో అశ్విన్ బాబు దగ్గరకు తీసుకు వెళ్లారనని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నేను కథ విన్న వెంటనే అడ్వాన్స్ ఇచ్చా. అశ్విన్ దగ్గరకు తీసుకు వెళ్లగా... ఐదు నిమిషాల్లోనే సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఆయనకూ అంత నచ్చింది. ఆ విధంగా ఈ సినిమా మొదలు అయ్యింది'' అని అన్నారు.
Shivam Bhaje Release Date: 'శివం భజే' కథను క్లుప్తంగా చెప్పలేమని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అలాగే, ప్రేక్షకుల విడుదలకు ముందు పూర్తిగా కథను రివీల్ చేయలేమన్నారు. ఇంకా మాట్లాడుతూ... ''ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమాను ఒక జానర్‌కు మాత్రమే పరిమితం చేయలేం. సినిమా చూస్తుంటే... ఓ ఐదారు జానర్లు కలిపినట్టు 'శివం భజే' ఉంటుంది. అయితే... ప్రేక్షకులు అందర్నీ ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. స్వతహాగా నేను శివ భక్తుడిని. అందుకని, ఈ సినిమా చేయలేదు. కథ నచ్చడంతో చేశా. ఆ కథను గురువారం (ఆగస్టు 1న) థియేటర్లలో చూస్తారు'' అని చెప్పారు.
'హిడింబ' చూసి అశ్విన్ బాబును తీసుకున్నాం!
Shivam Bhaje Movie Hero Name: 'హిడింబ' సినిమా చూశాక అశ్విన్ బాబును హీరోగా తీసుకోవాలని అనుకున్నామని మహేశ్వర్ రెడ్డి వివరించారు. తెర మీద హీరో అశ్విన్ అయితే... తెర వెనుక హీరో సంగీత దర్శకుడు వికాస్ బడిస అన్నారు. ''మా సినిమాకు వికాస్ బడిస అద్భుతమైన పాటలతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చాడు. కొన్ని సీన్లలో గూస్ బంప్స్ వచ్చేలా చేశారు'' అని చెప్పారు.
Also Read: ప్రభాస్ కోసం వెనక్కి తగ్గిన మంచు మనోజ్, తేజా సజ్జా - 'రాజా సాబ్' వెనుక 'మిరాయ్' రిలీజ్ డౌటే!
'శివం భజే' సినిమాను ఇప్పటి వరకు ఎవరికీ చూపించలేదని చెప్పారు మహేశ్వర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ... ''విక్టరీ వెంకటేష్ గారు మా ట్రైలర్ చూసి బావుందని మెచ్చుకున్నారు. అంతే కానీ... మేం ఎవరికీ సినిమా చూపించలేదు. వెంకటేష్ గారితో అశ్విన్ బాబుకు క్రికెట్ వల్ల మంచి రిలేషన్ ఉంది. ట్రైలర్ చూసి ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. జూలై 31న అమెరికాలో ప్రీమియర్ షోలు వేస్తున్నాం. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకంతో సినిమా విడుదల చేస్తున్నాం. మున్ముందు భారీ సినిమాలు ఉన్నాయి కనుక ఇదే మంచి విడుదల తేదీ అనుకున్నాను'' అని చెప్పారు.
కార్తికేయతో సినిమా ప్లానింగ్... నెక్స్ట్ మరొకటి!
'శివం భజే' తర్వాత 'ఐఐటీ కృష్ణమూర్తి' చిత్ర బృందంతో ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. యువ కథానాయకుడు కార్తికేయతో కూడా ఒక సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. మంచి కథల కోసం తాను ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 'శివం భజే'కు తెలుగులో విశేష ఆదరణ లభిస్తే తమిళంలో రీమేక్ చేసే ఆలోచన ఉందన్నారు. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మేశామని, హిట్ అయితే రెండో పార్ట్ కూడా ప్లాన్ చేస్తామని చెప్పారు.
Also Read: చిరు, పవన్, చరణ్ కోసం కథ రాస్తున్న దర్శకుడు - మెగా మల్టీస్టారర్ వర్కవుట్ అయ్యేనా?