మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్' మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాపై ఆడియన్స్ లో మరింత హై క్రియేట్ చేసేందుకు తాజాగా మేకర్స్ మరో అప్డేట్ తో ముందుకు వచ్చారు. ఈసారి 'ఈగల్ - పద్ధతైన దాడి' పేరుతో మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పీక్స్ కి తీసుకెళ్ళింది. రవితేజతో 'ధమాకా' సినిమాని నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత విశ్వప్రసాద్ 'ఈగల్' క్లైమాక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సినిమాపై ఉన్న హైప్ ని మరింత పెంచేశారు.
'ఈగల్' చివరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది
'ఈగల్' క్లైమాక్స్ గురించి నిర్మాత విశ్వ ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఈగల్.. చివరి 40 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఇంత వరకు తెలుగులో అలాంటి అవుట్ పుట్ వచ్చి ఉండదు. ఎక్కువ చేసి చెప్పడం లేదు, బాహుబలితో కంపేర్ చేయడం లేదు గానీ.. లోకేష్ కనకరాజు స్టైల్లో క్లైమాక్స్ ఉంటుంది. సాధారణ తెలుగు సినిమాల క్లైమాక్స్ కి పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరు" అంటూ సినిమాపై మరింత హైప్ పెంచేశారు.
సాధారణ టికెట్ రేట్లతోనే
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు అందరికీ అందుబాటులో 'ఈగల్' సినిమా కోసం నిర్మాతలు సాధారణ టికెట్ రేట్లు ఉంచడం విశేషం. హైదరాబాద్ పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'ఈగల్' టికెట్ రేటు రూ. 200 మాత్రమే. ఏషియన్ మల్టీప్లెక్స్‌లలో కొన్ని చోట్ల 175 రూపాయలే. సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు విషయానికి వస్తే... బాల్కనీ రేటు రూ. 150 మాత్రమే. తెలంగాణలోనే కాదు, అటు ఏపీలోనూ 'ఈగల్' టికెట్ రేట్లు పెంచలేదు. మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 110 మాత్రమే ఉంది. కొన్ని థియేటర్లలో 145 రూపాయలు పెట్టారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో వరుస సినిమాలు
రవితేజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మొదట 'ధమాకా' సినిమా చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ సినిమాల్లోనే సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. 'ధమాకా' తర్వాత ఇదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో 'ఈగల్' సినిమా చేశారు. ఈ మూవీ రిలీజ్ కాకముందే ఇదే నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ ఫిలిమ్ 'మిస్టర్ బచ్చన్' చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో రవితేజకి మంచి బాండింగ్ కుదరడంతో ఈ సంస్థలో మరిన్ని సినిమాలు చేయడానికి తాను రెడీగా ఉన్నట్లు ఇటీవల రవితేజ 'ఈగల్' ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు.
డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. సీనియర్ నటి మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్, కోలీవుడ్ యాక్టర్ వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read : ‘బేబీ’ హిందీ రీమేక్‌లో హీరోయిన్ ఫిక్స్ - వైష్ణవి చైతన్య స్థానంలో స్టార్ కిడ్