Priyanka Mohan First Look From 666 Operation Dream Theater : కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, వెర్సటైల్ స్టార్ ధనుంజయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ '666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'. క్లాసిక్ టైంతో రూపొందుతోన్న ఈ మూవీకి 'సప్త సాగరాలు దాటి' ఫేం హేమంత్ ఎం రావు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
వింటేజ్ లుక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' మూవీతో అలరించిన బ్యూటీ ప్రియాంక మోహన్ ఈ మూవీలో డిఫరెంట్ రోల్‌లో నటిస్తున్నారు. డిజైన్ పరంగా, కథకు కనెక్ట్ అయ్యేలా ఆమె లుక్ స్పెషల్‌గా కనిపిస్తోంది. వింటేజ్ వైబ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'గందరగోళ పరిస్థితుల మధ్య ఎగురుతున్న సీతాకోకచిలుకను పరిచయం చేస్తున్నాం.' అంటూ మూవీ టీం తెలిపింది.
ప్రియాంక వెనుక భాగంలో మెరిసే బంగారు రంగు పౌర్ణమి చంద్రుడు ఉండగా... స్వేచ్ఛగా ఎగురుతున్న సీతాకోకచిలుకతో ఆమె ఆడుకోవడం... ఇయర్ ఫోన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇక రెండో పోస్టర్‌లో ప్రియాంకను రెట్రో స్టైల్లో చూపించారు. ప్రియాంక ముత్యాల ఆభరణాలు, పువ్వుల డిజైన్ ఉన్న డ్రెస్సు, గ్లవ్స్, పెద్ద అంచులు ఉన్న టోపీ ధరించిన లుక్‌లో కనిపించింది. ఈ లుక్ చూస్తే క్లాసిక్ టైమ్ నేపథ్యంతో రూపొందిన థ్రిల్లర్ సినిమాకు చక్కగా సరిపోతుంది. రెండు పోస్టర్లలో చూపించిన దాన్ని బట్టి ఈ మూవీ టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి.
Also Read : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
జనవరిలో స్పెషల్ వీడియో
ఈ విజువల్స్ చూస్తుంటే అందం, రహస్యం, ఫాంటసీ అన్నీ కలిగలిసిన ఓ వైవిధ్యమైన, ప్రత్యేకమైన కథా ప్రపంచం ఈ సినిమాలో ఉండబోతున్నట్టుగా అనిపిస్తోంది. రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, ధనంజయ్ ఫస్ట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక జనవరిలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాను వైశాక్ జె ఫిలిమ్స్ బ్యానర్‌పై హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వైశాక్ జె. గౌడ నిర్మిస్తున్నారు. చరణ్ రాజ్ మ్యూజిక్ అందిస్తుండగా... అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వాస్ కశ్యప్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఇంచారా సురేష్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. సినిమా 3షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్, పెద్ద స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.