ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారోనని ఫ్యాన్స్ మాత్రమే కాదు... ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన నోటి వెంట పెళ్లి మాట వచ్చింది. అయితే, ఎప్పుడు చేసుకుంటాననేది చెప్పలేదు. ఎందుకు చేసుకోవడం లేదో చెప్పారు. 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ వేడుకలో 'ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి?' అని ఓ అభిమాని రాసిన పేపర్ చూసి యాంకర్ సుమ క్వశ్చన్ అడిగారు. ''అది తెలియక (అమ్మాయిలో ఉండాల్సిన క్వాలిటీస్) ఇంకా పెళ్లి చేసుకోలేదు'' అని చెప్పారు ప్రభాస్.
సంజయ్ దత్ స్క్రీన్ తినేశారు...'ది రాజా సాబ్' నానమ్మ - మనవడి కథ'ది రాజా సాబ్' సినిమా ఓ నానమ్మ - మనవడి కథ అని ప్రభాస్ తెలిపారు. తనకు జరీనా వాహెబ్ నటించారని, ఆవిడ అద్భుతంగా చేసారని తెలిపారు. ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ... ''దర్శకుడు మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. మన సినిమాలో నాన్నమ్మ అన్నారు. జరీనా వాహెబ్ చాలా బాగా చేశారండీ. డబ్బింగులో ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోయా. నేను మా నాన్నమ్మ (జరీనా వాహెబ్) ఫ్యాన్ అయిపోయా. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. సంజయ్ సార్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్బ్. క్లోజప్ పెడితే మొత్తం తినేస్తారు'' అని చెప్పారు. ఇక, సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారని, ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి, వెరీ గుడ్ పెర్ఫార్మన్స్ మాళవిక అని, ఆవిడవి బ్యూటిఫుల్ ఐస్ అని, సెట్ లో అందరి ఫేవరెట్, పాజిటివ్ పర్సన్ నిధి అగర్వాల్ అని చెప్పారు.
Also Read: స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న 'ది రాజా సాబ్' దర్శకుడు... ఓదార్చిన ప్రభాస్
'ది రాజా సాబ్' అనుకున్నప్పుడు ఇండియాలో మనకుఈ స్థాయిలో ఆర్ఆర్ఇచ్చేవాడు ఎవడున్నాడని చూస్తే తమన్ కనిపించారని ప్రభాస్ చెప్పారు. ఈ సినిమా క్లైమాక్స్ చూశాక మారుతి ఫ్యాన్ అయ్యానని, అది చూశాక ఆయన ఫ్యాన్ అయ్యానని చెప్పారు. క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ అని వివరించారు. మారుతి 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని, చూసుకోమని అభిమానులకు ప్రభాస్ చెప్పారు. సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలని, మాది (ది రాజా సాబ్) కూడా అయిపోతే హ్యాపీ అని చెప్పారు.
Also Read: 'స్పిరిట్' లుక్‌లో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు... ప్రభాస్ పిలక చూశారా?