Priyamani: ఒకప్పుడు టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారంతా చాలాకాలం బ్రేక్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అందులో కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి ముందుకొస్తుంటే.. కొందరు మాత్రం ఇంకా లీడ్ రోల్స్ చేస్తూ బిజీ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు ప్రియమణి. ఈ భామ.. తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా ఒక సినిమా షూటింగ్ సమయంలో సరైన బాత్రూమ్స్ లేక తాను ఎలా కష్టపడిందో బయటపెట్టారు. 


యావరేజ్ హిట్స్..


హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయిన తర్వాత ముందుగా ‘ఎవరే అతగాడు’ అనే చిత్రంతో తెలుగులో డెబ్యూ ఇచ్చారు ప్రియమణి. ఆ తర్వాత వెంటనే కోలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయారు. తమిళంలో ‘కంగళ్ కైదు సెయ్’.. తన మొదటి చిత్రం. అలా కొన్నేళ్ల పాటు తమిళ, మలయాళ, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా ప్రియమణికి సరైన బ్రేక్ రాలేదు. ఎక్కువశాతం మూవీస్ అన్నీ యావరేజ్ హిట్‌గానే నిలిచాయి. అప్పుడే కార్తీ హీరోగా తెరకెక్కిన ‘పరుతివీరన్’ సినిమా ప్రియమణి చేతికి వచ్చింది. ఈ మూవీ వల్ల తన కెరీర్ మలుపు తిరిగింది. ఇక తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ‘పరుతివీరన్’ కోసం తాను ఎంత కష్టపడిందో బయటపెట్టారు ఈ భామ.


మూవీకి నేషనల్ అవార్డ్..


‘‘2006లో ‘పరుతివీరన్’ చేస్తున్నప్పుడు వ్యానిటీ వ్యాన్స్, క్యారవ్యాన్ లాంటివి ఏమీ లేవు. అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. మధురైలో షూటింగ్ జరిగింది. దాంతో పాటు తమిళనాడులోని కొన్ని పల్లెటూళ్లలో షూట్ చేశాం. అక్కడ ఉండేవాళ్ల ఇళ్లకు వెళ్లి రెస్ట్ రూమ్ ఉపయోగించాల్సి వచ్చింది. అలా కాకపోతే ఓపెన్‌గా వెళ్లాల్సి వచ్చేది’’ అని బయటపెట్టారు ప్రియమణి. ‘పరుతివీరన్’ అనేది కార్తీ కెరీర్‌లో మొదటి చిత్రం. 2007లో విడుదలయిన ఈ సినిమా ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ కథలో అద్భుతంగా నటించినందుకు ప్రియమణికి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. కార్తీ కూడా మంచి నటుడిగా నిలదొక్కుకున్నాడు.


అలాంటి సినిమాలకు బ్రేక్..


అసలైతే ప్రియమణి.. సినిమాల నుండి ఎప్పుడూ ఎక్కువగా బ్రేక్ తీసుకోలేరు. కానీ తను నటించిన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో వెండితెరపై తనను చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటిస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. తెలుగు మాత్రమే కాదు.. హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా తను బిజీగా సినిమాలు చేస్తున్నారు. ఇక తనకు ఎలాంటి జోనర్ మూవీస్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంది అని అడగగా.. అలా ప్రత్యేకంగా ఒక జోనర్ అని ఏం లేదని, ఏదైనా తనకు నచ్చితే చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికే తాను ఎక్కువగా హారర్ చిత్రాల్లో నటించానని, ఇప్పుడు మంచి యాక్షన్ మూవీ చేయాలనుందని తన కోరికను బయటపెట్టారు ప్రియమణి.


Also Read: అమలా పాల్‌ షాకింగ్‌ పోస్ట్‌ - చేతిలో బిడ్డ, కవలలంటూ హింట్‌? కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న బ్యూటీ!