Mithra Mandali First Single Jambar Gimbar Lala Song Out: రవితేజ 'వెంకీ' సినిమాలో గజాలాగా బ్రహ్మానందం కామెడీతో పాటు ఆయన డైలాగ్ కూడా చాలా ఫేమస్. 'జంబర్ గింబర్ లాలా డంబర్ డారీ డారీ రారరో...' అంటూ సాగే ఓ డైలాగ్ ఇప్పటికీ మీమ్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ఇప్పుడు ఇదే డైలాగ్‌తో ఓ సాంగ్ వచ్చేసింది. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో నటించిన 'మిత్ర మండలి'లో ఈ పాట ఫుల్ వీడియోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.
సాంగ్ అదుర్స్
కామెడీ కింగ్ బ్రహ్మానందం 'జంబర్ గింబర్ లాలా...' అనే డైలాగ్‌తో సాంగ్ స్టార్ట్ చేయగా... ఆయన ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి. 'ఆక్ ఈజ్ పాక్ పాక్ ఈజ్ ఆక్ ఆక్ పాక్ కరేపాక్... నాతోటి వస్తావా తినిపిస్తా మైసూర్ పాక్...' అంటూ సాగే లిరిక్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ఈ పాటకు ఆర్ ఆర్ ధ్రువన్ మ్యూజిక్, లిరిక్స్ అందించగా... అదితి భవరాజు, ఆర్ఆర్ ధ్రువన్ పాడారు. మోయిన్ కొరియోగ్రఫీ అందించారు.
Also Read: 'OG' ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ మాస్ ట్రీట్... 'ఓజస్ గంభీర' వేరే లెవల్
ఈ మూవీలో ప్రియదర్శి సరసన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక్ ఎన్ఎం హీరోయిన్‌గా చేస్తున్నారు. ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. వీరితో పాటు ప్రసాద్ బెహర, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, సత్య, వీటీవీ గణేష్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొత్త డైరెక్టర్ ఎస్. విజయేంద్ర దర్శకత్వం వహిస్తుండగా... ఆర్ఆర్ ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కుతోంది. ఫేమస్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ న్యూ బ్యానర్ 'బన్నీ వాస్ వర్క్స్' సమర్పణలో... సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 16న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.