''రాజమౌళి గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఏ విధమైన పేరు తీసుకొచ్చారో... నేను మా మలయాళ చిత్రసీమకు ఆ విధంగా పేరు తీసుకు రావాలని అనుకుంటున్నా'' అని ఆ మధ్య ఓ కార్యక్రమంలో మలయాళ స్టార్, దర్శక - నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పేర్కొన్నారు. 'బాహుబలి', 'RRR'లతో తెలుగు సినిమాను ఎలా వరల్డ్ స్టేజ్ మీదకు రాజమౌళి ఎలా తీసుకువెళ్ళారో... అలాంటి ఓ కథతో మలయాళం సినిమాను వరల్డ్ వైడ్ పాపులారిటీ తీసుకు రావాలనుందని ఆయన ఆశపడ్డారు. అప్పటికి 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాకు ఆస్కార్ రాలేదు. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా ట్రైలర్ చూస్తే... ఆయన నిజంగా ఆస్కార్ తీసుకు వచ్చేలా ఉన్నారు.
రాజమౌళి మీద గౌరవంతో అప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అలా చెప్పాడని అనుకున్నారు గానీ... మలయాళం సినిమా 'ఆడు జీవితం' ట్రైలర్ చూస్తే, ఆ మాట వెనుక ఎంత సీరియస్ ఉందో అర్థం అవుతుంది. ఈ సినిమాను ఇంగ్లీషులో 'ది గోట్ లైఫ్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ అవార్డ్స్ కోసం ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ట్రైలర్ పంపించారు. అది కాస్తా లీక్ కావడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియాలో ట్రైలర్ విడుదల చేశారు.
సౌదీలో మనోళ్ళ కష్టాలే...
'ఆడు జీవితం' సినిమా కథ!
ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బ్లెస్సీ పదిహేనేళ్లుగా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ ఏడాది కాన్ చలన చిత్రోత్సవాల్లో సినిమా ప్రీమియర్ షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ, 'ఆడు జీవితం' కథ ఏమిటంటే...
పొట్టకూటి కోసం ఎడారి దేశం సౌదీకి వలస వెళ్లిన ఓ ఇమ్మిగ్రెంట్ లైఫ్ చుట్టూ 'ఆడు జీవితం' తిరుగుతుంది. నజీబ్ మొహమ్మద్ అనే కేరళ వ్యక్తి సౌదీలో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది కథ. పాస్ పోర్టులు లాక్కోవటం... బానిసలుగా మార్చుకోవటం... ఇమ్మిగ్రేషన్ కష్టాలు... ఎడారిలో బానిస బతుకు.... ఇలా ఓ వలస వ్యక్తి కష్టాలు అన్నింటినీ కళ్లకు కట్టినట్లు ట్రైలర్ (Aadujeevitham Trailer) లో చూపించారు.
పృథ్వీరాజ్ లుక్ ఏంట్రా బాబు!?
Prithviraj Sukumaran Shocking Look : ఎడారి దేశాలకు వెళ్లిన వలస కూలీల జీవితానికి 'ఆడు జీవితం' కథ ప్రతిరూపం అన్నట్టు ఉంది. కథ పక్కన పెడితే... వలస కూలీగా, బానిస వ్యక్తిగా పృథ్వీరాజ్ తన లుక్ మార్చుకున్న తీరు మతులు పోగొట్టేలా ఉంది. కొంత మంది గుర్తు పట్టడం కూడా కష్టం. చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమాపై పని చేస్తున్న పృథ్వీరాజ్... సినిమా అవుట్ పుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
చాలా ఏళ్ల క్రితమే ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉన్నా అప్పటి మార్కెట్స్ ప్రకారం సినిమా బడ్జెట్ వయబుల్ కాదని వెయిట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టైమ్ లో ముందుగా ఫిలిం ఫెస్టివల్స్ లో రిలీజ్ చేసి బజ్ వచ్చిన తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేయాలనేది ప్లాన్.
పృథ్వీరాజ్ జోడిగా అమలా పాల్!
'ఆడు జీవితం'లో పృథ్వీరాజ్ భార్యగా అమలాపాల్ యాక్ట్ చేశారు. బెన్యామిన్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో సినిమా తెరకెక్కించారు. షూటింగ్ అంతా దాదాపుగా జోర్డాన్, అల్జీరియాలోని సహారా ఎడారిలో కఠినమైన పరిస్థితుల్లో షూట్ చేశారు. ప్రొడక్షన్ కోసం ఇండియాకు, యూఎస్ కు చెందిన నాలుగు కంపెనీలు వర్క్ చేయటం విశేషం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్, అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా 3D లోనూ విడుదల కానుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..ఇండియా నుంచి నెక్ట్స్ బిగ్గెస్ట్ సెన్సేషన్ గా ఆడుజీవితం అవుతుందని మలయాళం ఫిలిం ఇండస్ట్రీ భావిస్తోంది.
Also Read : 'పుష్ప 2' లుక్ మీద కొత్త రచ్చ - 'కాంతార'లా ఉందేంటి?