Prithviraj Sukumaran About Varanasi Shooting : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ వారణాసి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రణకుంభగా విలన్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారణాసి షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
90కి పైగా టేక్స్
'వారణాసి'లో ఓ స్పెషల్ షాట్ కోసం 90కి పైగా టేక్స్ తీసుకున్నట్లు చెప్పారు పృథ్వీరాజ్. 'వారణాసిలో ఓ స్పెషల్ షాట్ ఉంది. నేను, మహేశ్ బాబు ఉదయాన్నే మొదలుపెట్టాం. అయితే, ఆ రోజు కంప్లీట్ చేయలేకపోయాం. దీంతో అది మరుసటి రోజుకు కొనసాగింది. ఆ షాట్ కోసం 90కి పైగా టేక్స్ తీసుకున్నాం. షూట్‌లో లంచ్ బ్రేక్ 20 నిమిషాలే. ఫుట్ తినే లోపే షాట్ రెడీ అనగానే పరిగెత్తుకు వెళ్లి యాక్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాజమౌళి సార్‌ది పర్ఫెక్ట్ విజన్.' అని చెప్పారు.
రాజమౌళి న్యూ డైరెక్టర్
వారణాసి కోసం రాజమౌళి ఓ కొత్త డైరెక్టర్‌లా వర్క్ చేస్తున్నారని చెప్పారు పృథ్వీరాజ్. '30 ఏళ్లుగా ఛాన్స్ కోసం వెయిట్ చేసిన ఓ కొత్త డైరెక్టర్‌లా వారణాసి కోసం రాజమౌళి వర్క్ చేస్తున్నారు. సెట్స్‌లో ఫస్ట్ అడుగుపెట్టేది ఆయనే. లాస్ట్‌కు వెళ్లేది కూడా ఆయనే. 7AMకు ఫస్ట్ షాట్ ఉన్నప్పుడు ఆయన ఉదయం 5 గంటలకే వచ్చి టీంతో రిహార్సల్స్ చేసేవారు.
వారణాసిలో ఓ స్పెషల్ సీక్వెన్స్ ఉంది. మూవీలో ఓ స్పెషల్ సీక్వెన్స్ ఉంది. దాన్ని ఎలా షూట్ చేయాలని నేను అడిగా. స్టోరీ చెప్పేటప్పుడు తనకు తెలియదని అన్నారు. కానీ సెట్స్‌లో దాన్ని ఎలా చేయాలో కచ్చితంగా నిర్ణయించుకున్నారు.' అని తెలిపారు.
Also Read : Samantha: ప్రెగ్నెంట్ అయ్యాక మొదటిసారి మీడియా ముందుకు... 'మా ఇంటి బంగారం' థాంక్యూ మీట్‌లో సమంత
'ఈ స్థాయి చూడలేదు'
వారణాసి లాంటి సినిమా స్థాయిని ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పారు పృథ్వీరాజ్. 'వారణాసి లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు పెద్దది అనే పదం కూడా సరిపోదు. ఇంతకు ముందెన్నడూ ఈ స్థాయిని చూడలేదు. రాజమౌళి సార్ కూడా అది చూడలేదని చెబుతుంటారు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడం వల్ల ఓ డైరెక్టర్‌గా, మనిషిగా పరిణితి చెందుతున్నాను. నేను ఏవైనా సూచనలు ఇచ్చినా ఆయన విని తన అభిప్రాయం చెప్పేవారు.' అని తెలిపారు.
ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న వారణాసి... ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకుంది. మహేశ్ బాబు షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుని ట్రిప్ వెళ్లారు. త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి VFXపై ఫోకస్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.
సినిమాలో రాముడిగా, రుద్రుడిగా మహేశ్ బాబు కనిపించనున్నారు. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Mahesh Babu: వారణాసికి సూపర్ స్టార్ స్మాల్ బ్రేక్... ఫ్రాన్స్‌లో ఫ్యామిలీతో మహేష్
