Premalu actress Mamitha Baiju in Vijay’s next Movie: మ‌మ‌త బైజు.. 23 ఏళ్ల ఈ చిన్న‌ది చాలా త‌క్కువ కాలంలో ఎంతో పేరు తెచ్చుకుంది. 'ప్రేమ‌లు' సినిమాలో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌, క్యూట్ లుక్స్ తో ఎంతోమంది కుర్ర‌కారు మ‌న‌సు దోచేసింది. ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. అంతేకాదు ఎన్నో వ‌రుస ఛాన్సులు కొట్టేసింది మ‌మ‌త‌. జీవి ప్ర‌కాశ్ న‌టించిన రెబ‌ల్ సినిమాతో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన మ‌మ‌త వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు త‌ల‌ప‌తి విజ‌య్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంద‌ట‌. 


విజ‌య్ 69వ సినిమాలో.. 


త‌మిళ న‌టుడు, త‌ల‌ప‌తి విజ‌య్ సినిమాలో చేసే ఛాన్స్  కొట్టేసింద‌ట మ‌మ‌త‌. విజ‌య్ చేస్తున్న త‌న 69వ సినిమాలో ఆయ‌నతో క‌లిసి న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. విజ‌య్‌కు ఆమె చెల్లిగా న‌టిస్తుంద‌ని ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. ఇక విజ‌య్ న‌టిస్తున్న ఈ సినిమాకి వినోద్ డైరెక్ట‌ర్ కాగా.. కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సినిమా నిర్మిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఆమె విష్ణు విశాల్, అరుణ్ విజ‌య్ ల‌తో సినిమా చేస్తున్నారు. 


2018లో సినిమాల్లోకి.. 


కేర‌ళకు చెందిన మ‌మ‌త బైజు చిన్న వ‌య‌సులోనే మంచి ఆఫ‌ర్లు కొట్టేసింది. 2018లోనే ఆమె సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'స‌ర్వోప‌రి ప‌ల్కార‌న్' సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత 'ఆప‌రేష‌న్ జావ‌', 'సూప‌ర్ శ‌ర‌ణ్య‌', 'ప్ర‌ణ‌య విలాసం' త‌దిత‌ర సినిమాల్లో న‌టించింది. ఇక ఈ ఏడాది రిలీజైన ప్రేమ‌లు' సినిమాతో మాత్రం మ‌మ‌త స్టార్ తిరిగింద‌నే చెప్పాలి. మ‌ల‌యాళంలోనే కాకుండా ఆమెకు త‌మిళ్, తెలుగులో విపరీత‌మైన ఫ్యాన్ బేస్ పెరిగింది. మ‌ల‌యాళంలో ప్రేమ‌లు సినిమా హిట్ కావ‌డంతో దాన్ని తెలుగు, ఇత‌ర భాష‌ల్లోకి డ‌బ్బ్ చేశారు. ఇక ఆ సినిమాలో మ‌మ‌త క్యూట్ ఎక్స్ ప్రష‌న్స్, యాక్టింగ్ తో ఎంతోమంది కుర్ర‌కారును ఫిదా చేసింది. 


ఇక విజ‌య్ సినిమా విష‌యానికొస్తే.. ఆయ‌న న‌టించ‌బోయే 69వ సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే లుక్ టెస్ట్ అయిపోయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక త‌ర్వ‌లోనే ఫ‌స్ట్ పోస్ట‌ర్, టీజ‌ర్ రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట మేక‌ర్స్. విజ‌య్ న‌టిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' గోట్ సినిమా రిలీజైన త‌ర్వాత ఈ షూటింగ్ ముమ్మ‌రం చేస్తార‌ని తెలుస్తుంది. కాగా..  'గోట్' సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ కానుంది. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల అది పోస్ట్ పోన్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 


విజ‌య్ న‌టించిన 'గోట్' సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు ఉన్నాయి. వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ కృష్ణ వంటి నటీనటులు కూడా ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. యువ‌న్ శంక‌ర్ రాజా మ్యూజిక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇప్ప‌టికే రిలీజైన రెండు పాటలు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. 


Also Read: లావణ్యపై తరచూ ఆరోపణలు - శేఖర్‌ భాషాపై దాడి, ఆస్పత్రి బెడ్‌పై నుంచి వీడియో రిలీజ్!