Raj Tarun-Lavanya Case: లావణ్యపై తరచూ ఆరోపణలు - శేఖర్‌ భాషాపై దాడి, ఆస్పత్రి బెడ్‌పై నుంచి వీడియో రిలీజ్!

Attack on RJ Shekar Basha: రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసులో ఆర్జే శేఖర్‌ భాషా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తరచూ లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కేసును కొత్త మలుపు తిప్పుతున్న అతడిపై దాడి జరగడం గమనార్హం.

Continues below advertisement

Attack on RJ Shekar Basha: హీరో రాజ్‌ తరుణ్‌, అతడి ప్రియురాలు లావణ్య వ్యవహారం రోజురోజుకు మరింత ముదురుతోంది. రాజ్‌ తరుణ్‌ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్‌ తరుణ్‌ వెంటనే స్పందిస్తూ లావణ్య మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఇలా ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.

Continues below advertisement

గత నెల రోజులుగా ఈ కేసు రోజుకో మలుపు, ట్విస్ట్‌లతో షాకిస్తుంది. గతకొద్ది రోజులుగా రాజ్‌ తరుణ్‌ మీడియాకు ముఖం చాటేయడం.. ఆ తర్వాత ఆర్జే శేఖర్‌ భాషా రంగంలో రావడంతో ఈ వ్యవహరం మరో మలుపు తీసుకుంది. శేఖర్‌ భాషా లావణ్యను టార్గెట్‌ చేస్తూ ఆమె బండారం బట్టబయలు చేస్తున్నాడు. లావణ్య డ్రగ్స్‌ తీసుకోవడమే కాదు.. అమాయకులైన అమ్మాయిలకు కూడా డ్రగ్స్‌ అలవాటు చేసిందని, వారి జీవితాలు నాశనం చేసిందని ఇటీవల లైవ్ డిబెట్లో ఆరోపించాడు. శేఖర్‌ భాషా వ్యాఖ్యలకు మండిపోయిన లావణ్య లైవ్‌లోనే అతడిని చెప్పుతో కొట్టిన సంఘటన సంచలనంగా మారింది. లావణ్య చేసిన పనికి శేఖర్‌ భాషా మరో అడుగు ముందుకు వేసి ఏకంగా బాధితులనే వెలుగులోకి తీసుకువచ్చాడు.

లావణ్య డ్రగ్స్‌ ఇచ్చిన యువకుడు ఉదయ్, యువతి ప్రీతిలు బయటకు తీసుకువచ్చి పోలీసు స్టేషన్‌ ఫిర్యాదు చేయించాడు. దీంతో ఈ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఇలా లావణ్య-రాజ్‌ తరుణ్‌ వ్యవహరంలో ట్విస్ట్‌ ల ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. లైవ్‌లోనే శేఖర్‌ భాషాను చెప్పుతో కొట్టిన లావణ్య.. తాజాగా తనపై దాడి చేయించిందంటూ శేఖర్ భాషా ఓ షాకింగ్‌ వీడియో రిలీజ్‌ చేశాడు. గాయాలతో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న శేఖర్‌ భాషా ఓ వీడియో విడుదల చేశాడు. లావణ్య ఇంకా నేను ఎలాంటి ఆధారలు తీసుకువస్తానోనని భయపడి నాపై దాడి చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వీడియో శేఖర్‌ భాషా మాట్లాడుతూ.. "మొన్నటి వరకు నేను రాజ్ తరుణ్‌-లావణ్య కేసులో అసలేం జరిగిందనేదే చెప్పాను. అప్పటి వరకు లావణ్య పెద్దగా రియాక్ట్‌ అవ్వలేదు.

కానీ, ఎప్పుడైతే నేను చిన్న పిల్లలకు డ్రగ్స్‌ అలవాటు చేసిందని అనగానే ఆమె మరింత రెచ్చిపోయింది. బాధితుల పేర్లు ఆధారాలతో సహా నేను బయటపెట్టగానే లావణ్య నాపై చెప్పులు విసిరింది. ఇదంతా లైవ్‌లో మీరే చూశారు. కానీ, అడిగిన క్వశ్చ్యన్స్‌కి మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు. నేను ఏ చానల్‌కు వెళ్లిన ఇలా బూతులు మాట్లాడుతూ, గొడవ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. డ్రగ్స్‌ గురించి మాట్లాడగానే గట్టిగా అరుస్తూ నానా రచ్చ చేస్తుంది. మీరు గమనించారో లేదో ఎప్పుడైతే నేను ప్రీతి పేరు తిశానో లావణ్య వెంటనే రియాక్ట్‌ అవుతుంది. గట్టిగా అరుస్తూ రచ్చ చేస్తుంది. అదంతా మీరు కూడా చూశారు. మళ్లీ నేను ఇంకేం ఆధారాలు తీసుకువస్తాననో అని భయపడి నాపై దాడి చేయించింది. ఇలా దాడి చేయించనంత మాత్రానా నేను భయపడి నిజాలు బయటికి చెప్పనని  లావణ్య భావిస్తుంది కావచ్చు" అంటూ శేఖర్‌ భాషా చెప్పుకొచ్చాడు. 

Also Read: 'తంగలాన్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌ సుమకు షాక్‌ - స్టేజ్‌పైనే కిస్‌ ఇచ్చిన నటుడు, అవాక్కైన యాంకర్

Continues below advertisement
Sponsored Links by Taboola