Preetha Vijayakumar: సినిమా అవకాశాలు లేవు, కానీ కోట్లలో సంపాదన - ఈ సీనియర్ నటి గుర్తుందా?

Preetha Vijayakumar: విజయకుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ప్రీతా విజయకుమార్. కానీ పెళ్లి తర్వాత ఒక్కసారిగా సినిమాలకు దూరమయిన ఈ నటి.. ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదిస్తుందని సమాచారం.

Continues below advertisement

Preetha Vijayakumar Income: హీరోయిన్లకు సినీ పరిశ్రమలో లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. రోజురోజుకీ కొత్త కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుండడంతో సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. సీనియర్లు అయినా కూడా కొందరికి అవకాశాలు వరుసగా వస్తూనే ఉంటాయి. కానీ మరికొందరు మాత్రం సినీ రంగంలో బిజీగా ఉన్నా.. వేరే ప్లాన్‌తో రెడీగా ఉంటారు. అలాంటి ప్లాన్ బీతోనే ఒక సీనియర్ నటి.. సినిమాల్లో నటించకుండా కోట్లలో సంపాదిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ నటి మరెవరో కాదు.. సీనియర్ నటుడు విజయకుమార్ కుమార్తె ప్రీతా విజయకుమార్. 

Continues below advertisement

ముందుగా తెలుగులోనే..

సీనియర్ నటుడు విజయకుమార్ కూతుళ్లు అందరూ సినీ పరిశ్రమల్లోనే ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రీతా విజయకుమార్ కూడా ఒకరు. ఈ భామ.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుక్మిణి’ అనే తెలుగు చిత్రంతోనే హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఆ వెంటనే ‘సందిపోమ్మా’ అనే తమిళ చిత్రంతో కోలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలా తనకు వరుసగా తమిళంలోనే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో కూడా ‘ప్రియమైన నీకు’లో సెకండ్ హీరోయిన్‌గా నటించి ఇక్కడ కూడా నటిగా గుర్తింపు దక్కించుకుంది. 2002లో ఒక తమిళ, ఒక మలయళ చిత్రాల్లో నటించి సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది ప్రీతా విజయకుమార్.

ప్రేమ.. పెళ్లి..

2002లో దర్శకుడు హరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రీతా విజయకుమార్. పెళ్లి తర్వాత పూర్తిగా సిల్వర్ స్క్రీన్‌కు దూరమయ్యింది. కోలీవుడ్‌లో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హరి. సినిమాలకు దూరమవ్వడంతో ప్రీతా ప్లాన్ బీతో సిద్దంగా ఉంది. చెన్నైలోని ఉత్తండి బీచ్ ప్రాంతంలో ‘ప్రీతా ప్యాలెస్’ అనే పేరుతో ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసింది. దాని వల్ల తను బాగానే సంపాదిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు ఆ కళ్యాణ మండపానికి దగ్గర్లోనే ‘మెట్రో కాఫీ హౌజ్’ అనే ఒక కాఫీ షాప్‌ను కూడా ఏర్పాటు చేసింది. ‘మద్రాస్ కాఫీ హౌజ్’ అనే పేరుతో ఈ కాఫీ షాప్‌కు ఫ్రాంచైజ్‌లను కూడా అందించింది. వీటితో పాటు తన పేరు మీద సినీ ఎడిటింగ్‌, డబ్బింగ్‌ స్టూడియో కూడా ఉందని సమాచారం.

బిజినెస్‌లో సూపర్ సక్సెస్‌ఫుల్..

సినిమాలకు దూరమయ్యి చాలాకాలం అయినా ఫంక్షన్ హాల్, కాఫీ హౌజ్.. దాని ఫ్రాంచైజ్‌లు, సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోల ద్వారా ప్రీతా.. నెలకు లక్షల్లో సంపాదిస్తుందని సమాచారం. ఒకప్పుడు సినిమాల్లో సక్సెస్‌ఫుల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. బిజినెస్‌లో కూడా సూపర్ సక్సెస్‌ఫుల్ అయ్యిందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రీతా. హరి, ప్రీతా జంటకు ముగ్గురు అబ్బాయిలు. అలా తన పిల్లలతో దిగిన ఫోటోలను అప్పుడప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రీతా విజయకుమార్.

Also Read: ఈగల్ రివ్యూ: మాస్ మహారాజా మారణహోమం... రవితేజ వన్ మ్యాన్ షో ఎలా ఉందంటే?

Continues below advertisement