ఆర్నాల్డ్ స్కార్జినెగ్గర్ హీరోగా 1987లో వచ్చిన 'ప్రెడేటర్' మూవీ ఒక కల్ట్ క్లాసిక్. 18 మిలియన్ డాలర్ల సాధారణ బడ్జెట్ తో రూపొందిన ఆ మూవీ 98 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. టీవీ ఛానళ్ళలో వచ్చినప్పుడు ఇప్పటికీ ఆ సినిమాని ఇంట్రెస్టింగ్ గా చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఆ సినిమా హిట్ తో 'ప్రిడేటర్'ను ఒక ఫ్రాంచైజీ మార్చిన హాలీవుడ్ ఇప్పుడు ఆ సిరీస్ లో కొత్త మూవీ 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్'ను రిలీజ్ కు సిద్ధం చేసింది. ఏడాది నవంబర్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయింది. సిరీస్ లోని పాత సినిమాలుకు భిన్నంగా టోటల్‌గా సరికొత్త టౌన్‌లో ఈ సినిమా రూపొందుడంతో 'ప్రెడేటర్' అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొత్త సినిమా కథ మారిందండోయ్... కాన్సెప్ట్ ఇదేసినిమా ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం ఒక యువ ప్రెడేటర్‌ను శక్తిహీనుడంటూ తమ ప్లానెట్ నుండి వేరొక గ్రహంలో వదిలేస్తారు. డెత్ ప్లానెట్‌గా పిలుచుకునే ఆ గ్రహంలో భయంకరమైన జీవులు ఉంటాయి. అదే గ్రహంలో మనుషులు వదిలేసిన సగం తెగిపోయిన మనిషి లాంటి సింథటిక్ ఆండ్రాయిడ్ 'థియా' యువ ప్రెడేటర్‌తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి డెత్ ప్లానెట్‌లోని భయంకరమైన ప్రమాదాలను ఎలా ఎదుర్కొంటారు? అనేదే సినిమా కథ.

టోటల్‌గా మారిపోయిన ప్రెడేటర్ టోన్... కొత్తగా! 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' మూవీ ఫ్రాంచైజీలో 9వ సినిమా. కానీ మిగిలిన సినిమాల్లో లేని సరికొత్త టోన్ ఈ మూవీ ట్రైలర్‌లో కనిపిస్తోంది. ప్రెడేటర్ డిజైన్ గానీ దాని ఫిజిక్ గాని గత సినిమాలతో పోలిస్తే కంప్లీట్‌గా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పైపెచ్చు ఈ సినిమాలో ప్రెడేటర్ హీరో కావడం విశేషం.

Also Read: 'కింగ్‌డమ్' రివ్యూ: విజయ్ దేవరకొండ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది? సినిమా హిట్టేనా?

కొత్త ప్రెడేటర్ డైరెక్టర్ మీద నమ్మకం... డాన్! నిజానికి మొదటి రెండు సినిమాలతో పోలిస్తే మిగిలిన 'ప్రెడేటర్' సిరీస్‌పై విమర్శకులు ఎప్పుడూ పెదవి విరుస్తూనే వచ్చారు. 2018లో 'ది ప్రెడేటర్' మూవీ డిజాస్టర్ కావడంతో ఇక ఆ సిరీస్ ఆగిపోయినట్టేనని అందరూ భావించారు.  కానీ కొత్త దర్శకుడు డాన్ ట్రాచెన్ బెర్గ్ ( Dan Trachtenberg) 2022లో HuLu ott కోసం రూపొందించిన 'PREY' మూవీ అనూహ్యంగా సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ - HULU డిస్నీ OTT కోసం ఆయన తీసిన యానిమేషన్ మూవీ 'ప్రెడేటర్ : కిల్లర్ అఫ్ ది కిల్లర్స్' ఈ ఏడాది జూన్‌లో రిలీజై క్రిటిక్స్ ప్రశంసలు పొందింది. ఇప్పుడు అదే డైరెక్టర్ నుంచి 'ప్రెడేటర్ : బ్యాడ్ ల్యాండ్స్' సినిమా నవంబర్ 7న రిలీజ్ కావడానికి సిద్ధమైంది. దానితో ఆ ప్రాంచైజీ అభిమానులు ఎంతో ఆసక్తిగా మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 'ఏలియన్' సినిమా ఫ్రాంచైజీతో కలిపే హింట్స్ సినిమా ట్రైలర్ లో చాలానే ఉన్నాయి. ఇంతకు ముందు ఒకసారి ఆ ప్రయత్నం జరిగినా అది పెద్దగా సక్సెస్ కాలేదు. తనతో ఎలా చూసినా 'ప్రెడేటర్ : బ్యాడ్ ల్యాండ్స్' మూవీ అటు 'ప్రెడేటర్' సిరీస్‌కూ, ఇటు 'ఏలియన్' సిరీస్‌కూ భవిష్యత్తులో మరిన్ని కొత్త స్టోరీ లైన్లతో సినిమాలు వచ్చేందుకు దారులు తెలుస్తుందని ఆ రెండు ఫ్రాంచైజీల అభిమానులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థ‌తో ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమా - ఫ‌హాద్ ఫాజిల్ తండ్రితో ప‌వ‌ర్‌ స్టార్ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?