'టికెట్‌ కొట్టు – ఐఫోన్‌ పట్టు', 'థియేటర్లలో డబ్బుల వర్షం' (మనీ రెయిన్ ఇన్ థియేటర్స్) అంటూ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసిన సినిమా 'వర్జిన్ బాయ్స్'. ఇటీవల ట్రైలర్ లాంచ్‌లో అనౌన్స్ చేయడమే కాకుండా.... చెప్పినట్టు ఒక ప్రేక్షకుడికి ఐఫోన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు నిర్మాత రాజా దారపునేని.

శుక్రవారం థియేటర్లలోకి 'వర్జిన్ బాయ్స్''బిగ్‌ బాస్‌' ఫేమ్ మిత్రా శర్మ (Mitraaw Sharma), గీతానంద్‌ జంటగా నటించిన సినిమా 'వర్జిన్ బాయ్స్' (Virgin Boys). దయానంద్‌ దర్శకత్వంలో రాజ్‌ గురు ఫిలిమ్స్ పతాకం మీద రాజా దారపునేని నిర్మించారు. ఇందులో శ్రీహాన్‌, కౌశల్‌ మండ, రోనీత్‌, జెనీఫర్‌, అన్షుల, సుజిత్‌ కుమార్‌, బబ్లూ, అభిలాష్‌ ప్రధాన తారాగణం. శుక్రవారం థియేటర్లలోకి వస్తోందీ సినిమా.

తొలి ఐఫోన్ గెలుచుకున్న లక్కీ విన్నర్ ఎవరంటే?మాదాపూర్ ఏరియాలో గురువారం ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో మిత్రా శర్మ, గీతానంద్, శ్రీహన్, రాజా దారపునేని పాల్గొన్నారు. అక్కడ 'వర్జిన్‌ బాయ్స్‌' మూవీ అడ్వాన్స్ టికెట్ తీసుకున్న ప్రేక్షకుల వివరాలతో లాటరీ తీయగా... చందా నగర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ఐఫోన్ గెలుచుకున్నారు. మరో పది ఐఫోన్స్ లాటరీలో ఇదే విధంగా ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది. 

మా ప్రయత్నం సక్సెస్ అయ్యింది... రాజా దారపునేని'టికెట్ కొట్టు ఐఫోన్ పట్టు', 'మనీ రెయిన్ ఇన్ థియేటర్స్' ఆఫర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని 'వర్జిన్ బాయ్స్' నిర్మాత రాజా దారపునేని సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''మా కాన్సెప్ట్స్‌ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్ళింది. ఎక్కడ చూసినా సినిమా గురించి చర్చ నడుస్తోంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలనే మా ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి బజ్‌ వచ్చింది. సోషల్‌ మీడియా ద్వారా చాలా మంది ప్రేక్షకులు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఎంతో మంది ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. థియేటర్లలో డబ్బులు పడితే తొక్కిసలాట జరుగుతుందని ప్రశ్నించిన జనాలు సైతం ఉన్నారు. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మేం ఏర్పాట్లు చేశాం. మనుషుల ప్రాణం విలువ, డబ్బులు విలువ తెలిసిన వాళ్లం. అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్లాన్‌ చేశాం'' అని అన్నారు.

Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

Virgin Boys Cast And Crew: గీతానంద్, మిత్రా శర్మ జంటగా శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వర్జిన్ బాయ్స్' చిత్రానికి దర్శకత్వం: దయానంద్, నిర్మాణం: రాజా దారపునేని, నిర్మాణ సంస్థ: రాజ్ గురు ఫిలిమ్స్, సంగీతం: స్మరణ్ సాయి.

Also Readరాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... బాలకృష్ణుడిగా జక్కన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?